Telangana

మల్కాజ్ గిరిపై కీలక నేతల గురి..! బీజేపీ ఏం చేయబోతుంది..?-tough competition in bjp for malkajgiri mp seat in loksabha elections 2024 ,తెలంగాణ న్యూస్



ఎక్కువ దరఖాస్తులు ఇక్కడ్నుంచే…ఇటీవల ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో లోక్ సభ అభ్యర్థుల విషయంపై రాష్ట్రా ఎన్నికల కమిటీ సభ్యులు డీకే అరుణ, మురళీధర్ రావు ,బండి సంజయ్,ఈటల రాజేందర్ ,గరికపాటి మోహన్రావు, జితేందర్ రెడ్డి సంస్థ గత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర రావు సమావేశం అయ్యారు. ఇందులో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల కోసం దరఖాస్తులను పరిశీలించగా…….ఇందులో మల్కాజిగిరి స్థానానికి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు నేతలు గ్రహించారు. ఈ సీటు కోసం మాజీ మంత్రి ఈటల రాజేందర్ గట్టిగా పోటీ పడుతున్నారు.తనకున్న రాజకీయ అనుభవం,ప్రజాదరణ దృష్టిలో పెట్టుకొని మల్కాజ్గిరి టికెట్ తనకే ఇవ్వాలని అగ్రనేతలను కోరుతున్నట్లు తెలుస్తోంది.ఆయనతో పాటు ఇదే సీటును బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ఆశిస్తున్నారు. దశాబ్దాలుగా తనకున్న జాతీయస్థాయి అనుభవం, పార్టీతో తనకు ఉన్న అంకితభావం వంటి అంశాలు పరిగణలోకి తీసుకొని పోటీకి అవకాశం ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్లు తెలుస్తుంది. వీరే కాకుండా మాజీ ఎంపీ చాలా సురేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ,బిజెపి రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి,కొంపల్లి మోహన్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కొమరయ్య,బీజేపీ అధికారి ప్రతినిధి తుళ్ళ వీరేంద్ర గౌడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నారు.దీంతో ఈ స్థానం లో ఎవరిని బరిలోకి దింపాలనేది బీజేపీ అధిష్టానానికి అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో జరుగుతుంది.



Source link

Related posts

Chevella MP Ticket 2024 : చేవెళ్ల ఎంపీ టికెట్

Oknews

Revanth Reddy on Modi | Revanth Reddy on Modi | ప్రధాని మోదీపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి

Oknews

రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై ప్రభుత్వం కసరత్తు, అర్హుల ఎంపిక ఇలా!-hyderabad news in telugu 500 gas cylinder beneficiaries selection process with asha workers ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment