ఎవడు ఆపుతాడో చూద్దాం
‘మా మాట సుపరిచితం, మా బాట సుపరిచితం… మేము ఏంటో మా వాళ్లేంటో, మా వెంట ఉండే మీకు సదా నమ్మకం’ అంటూ బాలయ్య షో ప్రారంభించారు. రోజులు మారినా రుతువులు రంగులు మార్చినా, ఎన్ని అమావాస్యలు చీకట్లు చిమ్మినా మళ్లీ చంద్రుడు ఉదయిస్తాడు అన్నారు. గడ్డుకాలంలో కరుడుగట్టిన గుండె ధైర్యం, చెడ్డపని చేయలేదు అనే మానసిక స్థైర్యం, మరపురాని గెలుపు తీరాలకు చేర్చుతుందని బాలయ్య అన్నారు. ఈ షోలో బాలయ్య తన పంచ్ డైలాగులతో రాజకీయ ప్రత్యర్థులకు సెటైర్లు వేశారు. ‘మేము తప్పు చేయలేదని మీకు తెలుసు. మేము తలవంచమని మీకు తెలుసు. మనల్ని ఆపడానికి ఎవడూ రాలేడని మీకు తెలుసు… మేము మీకు తెలుసు. మా స్థానం మీ మనసు. అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం… ఎవడు ఆపుతాడో చూద్దాం’ అని బాలకృష్ణ అన్నారు.