EntertainmentLatest News

మళ్ళీ వార్తల్లోకి బేబీ…ప్రేమికుల రోజు పూర్తి వివరాలు 


తెలుగు సినిమాతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎవ్వరు కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన బేబీ సినిమాని అంత త్వరగా  మర్చిపోలేరు.గత ఏడాది జులై 14 న చిన్నచిత్రంగా థియేటర్స్ లోకి అడుగుపెట్టి పెద్ద చిత్రంగా బయటకి వచ్చింది. అలాగే వర్షాలని సైతం లెక్క చెయ్యకుండా  ఆడియెన్స్ ని థియేటర్స్ కి పరుగులు పెట్టేలా కూడా చేసింది.అసలు థియేటర్స్ లో ఆడుతున్నన్ని రోజులు  బేబీ కథ గురించే అందరి మధ్య చర్చ జరిగింది.దీన్ని బట్టి  సినిమా తాలూకు విజయాన్ని ప్రభావాన్ని ఊహించుకోవచ్చు. మళ్ళీ కొన్నాళ్ల గ్యాప్ తర్వాత  ఇప్పుడు బేబీ గురించి అందరిలోను చర్చ నడుస్తుంది.

బేబీ ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తామని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆ చిత్ర నిర్మాత  ఎస్‌కెఎన్ మాట్లాడుతు బేబీ హిందీ రీమేక్ కి సంబంధించిన అప్డేట్ ని  వాలెంటైన్స్ డే రోజున ప్రకటిస్తామని తెలిపాడు. దీంతో  బేబీ  హిందీ వెర్షన్‌కి సంబంధించి మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు  కూడా వెల్లడి ఫిబ్రవరి 14 న వెల్లడి కానుంది. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో క్రేజీగా మారింది. బేబీని తమిళంలో కూడా రీమేక్ చేయనున్నట్లు ఎస్‌కెఎన్ తెలిపాడు.

బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల దాకా వసూలు చేసిన  బేబీకి హృదయకాలేయం ఫేమ్  సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. మరి హిందీ వెర్షన్ కి కూడా సాయినే డైరెక్ట్ చేస్తాడో లేక వేరే దర్శకుడో అనే విషయం కూడా  ఫిబ్రవరి 14 న తెలుస్తుంది. ఆనంద్ దేవరకొండ,  విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన  రొమాంటిక్ డ్రామా బేబీ లో  వైష్ణవి ప్రదర్శించిన నటనకి మంచి పేరు వచ్చింది. అలాగే  ఓవర్ నైట్ స్టార్ డమ్ ని కూడా తీసుకొచ్చింది.



Source link

Related posts

పాతిక లక్షల కోసం హత్య కేసులో ఇరుక్కున్నాను : సూర్య

Oknews

ఢిల్లీలో పెద్ద హీరోలు లేరు.. కాశ్మీరీ ఫైల్స్ డైరెక్టర్ సంచలన ప్రకటన

Oknews

పవన్‌కు వదిన ఇచ్చిన గిఫ్ట్ ఖరీదు ఎంతంటే..?

Oknews

Leave a Comment