దిశ, ఫీచర్స్ : మనం తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళలకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండకపోవడం, వారు సరైన ఆహారం తీసుకోకపోవడం వలన ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నెగ్లెట్ చేయకూడదు అంటున్నారు వైద్యులు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం చాలా మంది మూత్రపిండాలు, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే వారికి కిడ్నీ సమస్యలు ఉన్నట్లేనంట.
1. చర్మం రంగు మారడం అనేది కిడ్నీ సమస్యలకు సంకేతం. ఎవరి చర్మం అయితే లేత పసుపురంగులోకి మారిపోతుందో వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కిడ్నీలు డ్యామేజ్ అయితే చర్మం పసుపు రంగులోకి మారడం జరుగుతుంది అంటున్నారు నిపుణులు.
2. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఇది చర్మం పొడిబారడం, చర్మంపై దురద వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఈ పరిస్థితి దీర్ఘకాలంగా ఉంటే కిడ్నీలు దెబ్బతిన్నాయి అనడానికి సంకేతంగా భావించి వైద్యుడిని సంప్రదించాలి.
3. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోయినా లేదా మూత్ర పిండాలలో ఇన్ఫెక్షన్స్ వస్తే కళ్లు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయంట.
4.కళ్లకింద నల్లటి వలయాలు లేదా, కళ్లు ఎరుపు ఎక్కడం వంటి సమ్యలు కూడా కిడ్నీ పనితీరులో సమస్యలకు కారణం కావచ్చు అంటున్నారు వైద్యులు. అందువలన వీటిలో ఏ ఒక్కటి మీలో గుర్తించినా వైద్యుడిని సంప్రదించాలి.
5. మహిళ్లలో మూత్రపిండాలు డ్యామేజ్ అయి ఉంటే, చర్మంపై ముడతలు ఏర్పడవచ్చు. కిడ్నీల పనితీరులో ఆటంకం ఏర్పడిందని గుర్తించడానికి దీన్ని సంకేతంగా భావించవచ్చు.
Read More : థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ ఆహార టిప్స్ పాటించండి!