Health Care

మహిళా దినోత్సవం 2024 : పితృస్వామ్య సమాజంలో స్త్రీలకు సమాన హక్కులు కల్పిస్తున్నారా ?


దిశ, ఫీచర్స్ : ఏడాదిలో 365 రోజులు ఉండగా ఒక్కరోజు మాత్రమే మహిళలకు అంకితం చేశారు. 116 సంవత్సరాల క్రితం న్యూయార్క్ నగరంలో సుమారు 15 వేల మంది మహిళలు తమ హక్కుల కోసం ముందుకు రావడంతో 1908లో ఈ మహిళా దినోత్సవానికి పునాది పడింది. అప్పటికి ఇప్పటికి ప్రపంచం ఎంత మారినా.. దశాబ్దాలు గడిచినా మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. మొట్టమొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని 1911లో జరుపుకోగా 1921లో దాని తేదీని మార్చి 08కి మార్చారు.

మహిళా దినోత్సవాన్ని 1955లో ఐక్యరాజ్యసమితిలో జరుపుకోవడం ప్రారంభించినప్పుడు అధికారికంగా గుర్తింపు పొందింది. 1996 నుండి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ తో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024లో మహిళా దినోత్సవం థీమ్ ‘ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్’.

మహిళల హక్కుల విషయానికి వస్తే ఏ రంగంలోనైనా వారి విజయం గురించి మాత్రమే కాదు, ఆ రంగంలో స్త్రీలకు పురుషులతో సమానత్వం ఉందా అని ప్రశ్నలు తలెత్తుతాయి. ఇప్పటికీ బాలీవుడ్ లాంటి గ్లామర్ ప్రపంచంలో నటీనటుల కంటే ఆడవాళ్లకు తక్కువ పారితోషికం ఇస్తున్నారని అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి.

మహిళా దినోత్సవం నాడు స్త్రీలను పొగిడి వారు సాధించిన ఘనతలు చెబుతారు. కానీ పితృస్వామ్య సమాజంలో వారికి సమాన హక్కులు కల్పిస్తారా అనేది ప్రశ్నార్థకం ? ఎందుకంటే దశాబ్దాలు గడిచినా ఏదో ఒక విధంగా పితృస్వామ్య సమాజంలో మహిళల కోసం పోరాటం చేయడం ఇప్పటికీ కష్టమే. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ హయాంలో 1996 మహిళా బిల్లును ప్రవేశపెట్టినా ఆ తర్వాత దానిని ఆమోదించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ బిల్లు దాదాపు మూడు దశాబ్దాల పాటు నిశ్చలంగా ఉండడం దీనికి అతి పెద్ద ఉదాహరణ. చాలా సంవత్సరాల తర్వాత ఈ బిల్లు 2023లో ఆమోదించారు.

ప్రతి చిన్న విషయంలోనూ మార్పు తీసుకురావాలి..

ఒకవైపు సమాజం మారుతున్న అందులో మహిళలు అన్ని రంగాల్లోనూ పురోగమిస్తున్నట్లు కనిపిస్తోంది. మహిళలు వైమానిక దళంలో ఉద్యోగం చేస్తున్నా సోషల్ మీడియాలో ‘ఓ దీదీ, పాపా కి ప్యారీ’ వంటి పదాలను ఉపయోగించి డ్రైవింగ్ చేస్తున్న అమ్మాయిలను అవహేళన చేస్తుంటారు.

మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం కేవలం కార్యాలయంలో సమానత్వం గురించి మాత్రమే కాదు. మహిళల పై హింస గురించి అవగాహన కల్పించడం, వారి కోసం రూపొందించిన చట్టాలు, మహిళా విద్య వంటి ముఖ్యమైన ప్రాథమిక అంశాలు ఉన్నాయి. స్త్రీల పై జరుగుతున్న నేరాలను తగ్గించేందుకు ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా సరే, స్త్రీలు తమతో సమానమని మగ మనస్సు అంగీకరించగలిగినప్పుడే వారికి సమానత్వం లభిస్తుంది.



Source link

Related posts

శ్రీకృష్ణుడు 16 వేల వివాహాలు ఎందుకు చేసుకున్నాడో తెలుసా..

Oknews

Bra :బ్రా వేసుకోవడానికి సరైన వయసు ఏది.. ఎప్పటి నుంచి వాడాలంటే?

Oknews

రాత్రిపూట ఆలస్యంగా తినడం ప్రమాదకరం.. ఏం జరుగుతుందంటే..

Oknews

Leave a Comment