తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి రికార్డులు సృష్టించడం కొత్తేమి కాదు. ఆయన తన మొదటి సినిమా నుంచి రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. వాటి తాలూకు జ్ఞాపకాలు ఇంకా మహేష్ అభిమానుల్లోను ప్రేక్షకుల్లోను భద్రంగానే ఉన్నాయి. ఇక మహేష్ తన సినిమా కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా సుమారు సంవత్సరంన్నర గ్యాప్ తీసుకొని మొన్న సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ల్యాండ్ అయ్యాడు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.
గుంటూరు కారం హైదరాబాద్ సిటీలో రికార్డు స్థాయి థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.వాటిల్లో ఒక థియేటరే ఆర్ టిసి క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్. పైగా ఈ థియేటరే మెయిన్ థియేటర్..ఇప్పుడు ఈ థియేటర్ లోనే గుంటూరు కారం అదిరిపోయే రికార్డుని క్రియేట్ చేసింది. కేవలం పదిహేడు అంటే పదిహేడు రోజుల్లోనే కోటి రూపాయిల గ్రాస్ ని సాధించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత వేగంగా కోటి రూపాయలని సొంతం చేసుకున్న మూవీగా
కూడా గుంటూరు కారం మొదటి స్థానంలో నిలిచింది. అలాగే సుదర్శన్ లో వరుసగా కోటి రూపాయలు సొంతం చేసుకున్న మహేష్ బాబు ఏడవ మూవీగా కూడా గుంటూరు కారం నిలిచింది
ఇప్పుడు ఈ వార్తతో మహేష్ ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. మహేష్ వన్ మాన్ షో కి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు అనటానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అని అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైన గుంటూరు కారం మొదట నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం అన్ని ఏరియాల్లోను మంచి వసూళ్లనే సాధించుకుంటు వస్తుంది. మహేష్ నటనకి ఉన్న మ్యాజిక్ తో పాటు శ్రీలీల, మీనాక్షి చౌదరి అందచందాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. అలాగే రమ్య కృష్ణ ,ప్రకాష్ రాజ్,జగపతి బాబు ఈశ్వరి రావు లు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించిన తీరుకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. సూర్య దేవర రాధాకృష్ణ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన గుంటూరు కారానికి త్రివిక్రమ్ దర్శకుడు కాగా థమన్ మ్యూజిక్ ని అందించాడు.