EntertainmentLatest News

మహేష్ బాబు పుట్టిన రోజుకి ఎన్టీఆర్ భారీ హంగామా.. ఫ్యాన్స్ కి పూనకాలే 


ఎంటైర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)అభిమానులు ఎప్పటినుంచో ఒక రోజు కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు. ఆ రోజుకి ఎంత ప్రత్యేకత ఉందంటే  దేవర సెకండ్ సాంగ్ సెలెబ్రేషన్స్ లో ఉన్న వాళ్ళ మూడ్ సైతం ఆ ఒక్క రోజు గురించే ఆలోచిస్తూ ఉంది. ఆ రోజు రాకపోతుందా సినీ మార్కెట్ లో కాలర్ ఎగరేసి తిరగకపోతామా అని. లేటెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే  ఆ రోజు రానే వచ్చింది.పైగా ఇది  ఎలాంటి రూమర్ కాదు. అసలు సిసలు ఒరిజినల్ న్యూస్. 

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్(prashanth neel)కాంబోలో సినిమా ఉందనే విషయం అందరికి తెలిసిందే. భారీ చిత్రాల మేకర్స్ మైత్రి మూవీస్ నిర్మాతలు. దీంతో ఈ సూపర్ కాంబో ఎప్పుడు ప్రారంభం అవుతుందో అని ఫ్యాన్స్  వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ దేవర(devara)వార్ 2 (war 2)బిజీలో ఉండటం, ఇంకో పక్క  సలార్ 2 (salaar 2) స్క్రిప్ట్ పనుల్లో  ప్రశాంత్ బిజీగా ఉన్నాడనే  వార్తలు వస్తుండటంతో  ఎన్టీఆర్  మూవీ కొంచం లేట్ అవుతుందేమో అని కూడా  ఫ్యాన్స్ భావించారు. కానీ  లేటు చెయ్యకుండా ఎంతో గ్రాండ్ గా  ఈ నెల 9 న మూవీ ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్నీ మైత్రి మూవీస్(mythri movie makers)అధినేతల్లో  ఒకరైన రవి శంకర్ వెల్లడి చేసాడు. అదే విధంగా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు కానుంది. కాకపోతే ఎన్టీఆర్ మాత్రం అక్టోబర్ నుంచి  షూట్ లో జాయిన్ అవుతాడు. అప్పటి దాకా ఇతర నటి నటుల మీద సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారు.  హీరోయిన్ ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఎవరైనా కానీ లక్కీ హీరోయిన్ గా భావించవచ్చు. మూవీకి సంబంధిచిన  మరిన్ని వివరాలు తొమ్మిదవ తారీకునే  వెల్లడి కానున్నాయి.

ఇక ఈ న్యూస్ తో ఎన్టీఆర్ ఫాన్స్  పట్టరాని ఆనందంతో ఉన్నారు. ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో ఇండియన్ సినిమా హిస్టరీ లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని కూడా అంటున్నారు. ఇక అగస్ట్ 9 కి ఒక స్పెషల్ ఉంది.మహేష్ బాబు(maheshbabu)పుట్టిన రోజు. సో మహేష్ పుట్టిన రోజుకి ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని భారీ ట్రీట్ ఇవ్వబోతున్నాడన్న మాట. 


 



Source link

Related posts

అల్లు అర్జున్ కి నిజంగానే ఆర్మీ ఉంది..అందుకే వరల్డ్ రికార్డు ఇచ్చారు

Oknews

అక్టోబర్‌  రెండో వారంలో ‘పోయే ఏనుగు పోయే’ 

Oknews

This is worthless for BRS.. బీఆర్ఎస్‌కు ఇది మాయని మచ్చే..

Oknews

Leave a Comment