బాబులకే బాబు మహేష్ బాబు(mahesh babu)ఈ స్లోగన్ మహేష్ బాబు కొత్త మూవీ రిలీజ్ రోజున వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో మారుమోగిపోతు ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ఆనవాయితీని మహేష్ ఫ్యాన్స్ కంటిన్యూ చేస్తు వస్తున్నారు. ఇప్పుడు ఈ ఆనవాయితీ కి భారీ బ్రేక్ వస్తుందేమో అనే దిగులు వాళ్ళల్లో మొదలయ్యింది. ఎందుకో చూద్దాం.
మహేష్ గుంటూరు కారం (guntur kaaram)వచ్చి అప్పుడే ఆరు నెలలు అవుతుంది. ఆ మూవీ షూటింగ్ దశలోనే జక్కన్న(rajamouli)మూవీ కన్ఫార్మ్ అయ్యింది. దాంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద మహేష్ జక్కన్న కాంబో సరికొత్త రికార్డులు సృష్టించబోతుందని సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఇంతవరకు మూవీ గురించి అధికారంగా ఎలాంటి అప్ డేట్ లేదు.మొన్న ఆ మధ్యన స్క్రిప్ట్ వర్క్ పకడ్బందీగా జరుగుతుందని రచయిత విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad)చెప్పాడు అంతే. ఇక మళ్ళీ సినిమా గురించి న్యూస్ లేదు. అసలు మహేష్ తప్ప వేరే ఆర్టిస్టుల గురించి కూడా ఎలాంటి చర్చ లేదు. జక్కన్న ప్రీ ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం తీసుకుంటాడులే అని సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళల్లో సహనం కోల్పోయింది. కానీ వాళ్లందరికీ ఒక గుడ్ న్యూస్. ఆగస్టు 9 న మహేష్, జక్కన్న ల మూవీ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ రానుందనే వార్తలు వస్తున్నాయి.
ఎందుకంటే ఆరోజు మహేష్ పుట్టిన రోజు. దీంతో మేకర్స్ ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యకుండా మూవీ అప్ డ్తే ఇవ్వనున్నారని తెలుస్తుంది.ఇందుకు సంబంధించి జక్కన్నఒక కాన్సెప్ట్ వీడియోని కూడా విడుదల చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం ఆ పనుల్లోనే జక్కన్న బిజీగా ఉన్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ కాన్సెప్ట్ వీడియోతో పాటు ప్రాజెక్టుని కూడా అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నాడు. జనరల్ గా జక్కన్న తన కొత్త సినిమాని స్టార్ట్ చేసే ముందు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాడు. అందులో సినిమాకు సంబంధించిన కీలకమైన వివరాల గురించి మీడియాకి వెల్లడి చేస్తాడు. ఇప్పుడు కూడా ఆగస్టు 9కి ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాడని అంటున్నారు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం వాస్తవం. ఎప్పుడొచ్చామని కాదు. బుల్లెట్ దిగిందా లేదా. మహేష్ జక్కన్న మూవీ ఎప్పుడొచ్చినా సరే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం పక్క. దుర్గ ఆర్ట్స్ పై సీనియర్ నిర్మాత కే ఎల్ నారాయణ(kl narayana)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. టైటిల్ కూడా అదిరిపోనుందనే సమాచారం.