GossipsLatest News

మహేష్-రాజమౌళి కాంబోపై కీరవాణి హాట్ కామెంట్స్


సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కలయికలో మొదలు కాబోయే మూవీ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ కాంబో ని ఒకే ఫ్రెమ్ లో చూస్తామా.. వారిద్దరూ కలిసి కనిపించే క్షణం కోసం అభిమానులే కాదు.. పాన్ ఇండియా ప్రేక్షకుల సైతం కాచుకుని కూర్చున్నారు. మరి నిర్మాత ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పారు. 

రాజమౌళి కూడా మహేష్ మూవీ స్క్రిప్ట్ లాక్ చెసే పనిలో ఉన్నారు. తాజాగా ఈ మూవీకి మ్యూజిక్ అందించబోయే రాజమౌళి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.. రాజమౌళి-మహేష్ కాంబో మూవీపై చేసిన హాట్ కామెంట్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి. నేను ఇప్పటివరకు మహేష్-రాజమౌళి సినిమా సంగీత పనులు ప్రారంభించలేదు. ఎందుకంటే ఈ వారమే స్టోరీ లాక్‌ అయింది. 

ప్రస్తుతం కొన్ని టెస్ట్‌ షూట్స్‌ జరుగుతున్నాయి. నేను జులై లేదా ఆగస్టులో మ్యూజిక్‌ వర్క్‌ స్టార్ట్‌ చేస్తా అంటూ రాజమౌళి-మహేష్ మూవీ పై కీరవాణి చేసిన కామెంట్స్ ని మహేష్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. మహేష్ బర్త్ డే స్పెషల్ గా ఏమైనా రాజమౌళి ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారేమో అనే ఆశతో మహేష్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరి రాజమౌళి ఆలోచన ఎలా ఉందొ తెలియాల్సి ఉంది. 



Source link

Related posts

top telugu news from andhrapradesh and telangana on february 4th 2024 | Top Headlines Today: సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కీలక భేటీ

Oknews

NTR will stay in Mumbai for 10 days 10 డేస్ ముంబైలో మకాం వెయ్యనున్న ఎన్టీఆర్

Oknews

Bhatti Vikramarka says CM Revanth Reddy who came from Palamuru started the Krishna water diversion program | Bhatti Vikramarka: కృష్ణా జలాలు మళ్ళించే కార్యక్రమం ప్రారంభం, ఆ మంత్రి వల్లే అవుతుంది

Oknews

Leave a Comment