Entertainment

మాకు సరైన సపోర్ట్ లేదు.. ‘వాస్తవం’ బయటపెట్టిన హీరోయిన్!


మేఘశ్యాం, రేఖ నిరోష హీరో హీరోయిన్లుగా అంజనిసూట్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య ముద్గల్ నిర్మాతగా జీవన్ బండి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘వాస్తవం’. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాకి పెద్దపల్లి రోహిత్ (పి. ఆర్) మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

టీజర్ లాంచ్ సందర్భంగా నిర్మాత ఆదిత్య ముద్గల్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ఇష్టంతో చాలా కష్టపడి తీసాం. డైరెక్టర్ జీవన్ చెప్పిన కథ తీసిన విధానం చాలా బాగుంది. హీరో మేఘశ్యాం, హీరోయిన్ రేఖా నిరోషా చాలా బాగా నటించారు. పి. ఆర్ అందించిన మ్యూజిక్ కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ప్రేక్షకులు ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు జీవన్ బండి మాట్లాడుతూ.. “ఈ కథ నేను చెప్పినప్పుడు నన్ను నమ్మి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ ఆదిత్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో చేసిన ప్రతి చిన్న క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. నా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు  అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. పి. ఆర్ అందించిన మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. హీరో మేఘశ్యాం, హీరోయిన్ రేఖ నిరోషా చాలా బాగా నటించారు. కచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ.. “మా సినిమా లో చాలా మంచి కంటెంట్ ఉంది కాని సరైన సపోర్ట్ లేదు. మీడియా, ప్రేక్షకులే మాకు సపోర్ట్. ఈ సినిమా చాలా కష్టపడి తీసాం. అందరికీ నచ్చే కథ అవుతుంది. అతి త్వరలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మీ సపోర్ట్ ఆశీస్సులు మాపై ఉండాలని ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో మేఘశ్యాం మాట్లాడుతూ.. “నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కాలేజ్ నుంచే థియేటర్ ఆర్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. ఎక్కడ కథ నుంచి డివియేట్ అవ్వకుండా చాలా బాగా కథని తీసుకుని వచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఆదిత్య గారికి డైరెక్టర్ జీవన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.



Source link

Related posts

పూరి చేసిన పనికి హీరోయిన్ కేతిక శర్మ పంట పండింది!

Oknews

నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను.. వైరల్‌ అవుతున్న హీరోయిన్‌ సెల్ఫీ వీడియో!

Oknews

చిరంజీవి వెంకయ్యనాయుడు పట్ల తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఇదే

Oknews

Leave a Comment