EntertainmentLatest News

మాల్వీ మల్హోత్రా తమ్ముడిపై మర్డర్‌ అటెంప్ట్‌ కేసు.. రాజ్‌ తరుణ్‌కు మరో తలనొప్పి!


కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్న రాజ్‌ తరుణ్‌, లావణ్య వ్యవహారంలో రకరకాల ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. వీరిద్దరి వ్యవహారంలో మాల్వీ మల్హోత్రా, మయాంక్‌ మల్హోత్రా, మస్తాన్‌ సాయి.. ఇలా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఈ కేసుపై విచారణ చేపట్టిన నార్సింగి పోలీసులు హీరో రాజ్‌ తరుణ్‌కి నోటీసులు జారీ చేశారు. తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పి, తనతో 11 ఏళ్ళు సహజీవనం చేసిన రాజ్‌ తరుణ్‌ ఇప్పుడు ఓ హీరోయిన్‌ మోజులో పడి తనని వదిలేశాడని, తనకు న్యాయం చెయ్యాలంటూ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

రాజ్‌తరుణ్‌, లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్‌ మూవీ చూస్తున్న ఫీలింగ్‌ కలిగిస్తోంది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు రాజ్‌తరుణ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18లోగా విచారణకు  విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. కొత్త న్యాయచట్టం బీఎన్‌ఎస్‌ఎస్‌ 45 కింద రాజ్‌తరుణ్‌కు నోటీసులు ఇచ్చారు. రాజ్‌తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఏ 1గా రాజ్‌ తరుణ్‌, ఏ2గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్‌ మల్హోత్రని పేర్కొన్నారు. రాజ్‌ తరుణ్‌పై ఫిర్యాదు చేసినందుకు తనను చంపేస్తానని బెదిరించారని లావణ్య పేర్కొన్న నేపథ్యంలో వారిపై ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.



Source link

Related posts

ప్రేమలు మూవీ రివ్యూ

Oknews

YSRCP New Sketch on AP Capital 4వ రాజధాని.. వైసీపీ స్కెచ్ అదిరింది

Oknews

టాప్‌ హీరోల మోస్ట్‌ వాంటెడ్‌ సిల్వర్‌ జూబ్లీ మ్యూజిక్‌ డైరెక్టర్‌!

Oknews

Leave a Comment