రంగస్థలం మూవీలో రామ్ చరణ్, సమంతల జోడి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ మూవీ ఘన విజయంలో ఒక భాగం కూడా అయ్యింది.ఆ మూవీ తర్వాత ఇద్దరి కాంబో మళ్ళీ రిపీట్ అవ్వలేదు.కానీ సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి చరణ్, సమంత లు మళ్ళీ జత కట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలపై క్లారిటీ వచ్చింది.
రామ్ చరణ్ ప్రస్తుతం తన గేమ్ చేంజర్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ మూవీ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సాన దర్శకత్వంలో చరణ్ సినిమా చెయ్యబోతున్నాడు. ఈ మూవీలోనే చరణ్ సరసన సమంత అయితే బాగుంటుందని దర్శకుడు బుచ్చిబాబు అనుకున్నాడని ఈ విషయంపై ఆమెని సంప్రదించడం కూడా జరిగిందని ఆమె కూడా ఒకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలని తేలిపోయింది. ఎందుకంటే మేకర్స్ ఇంకా హీరోయిన్ అన్వేషణలోనే ఉన్నారు. అసలు వాళ్ళ ఊహల్లో సమంత పేరు లేనే లేదని తెలుస్తుంది.ఇలాగే గతంలో చరణ్ సరసన జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ లు నటించబోతున్నారనే వార్తలు వచ్చాయి.
ఇక చరణ్ సినిమా ఉత్తరాంధ్ర ఏరియాలో జరిగే విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో కూడుకున్న కథగా తెరకెక్కుతుంది. దీంతో ఎక్కువ మంది తారాగణం అక్కడి వారే అయ్యి ఉంటే సినిమాలో ఒరిజినాలిటీ ఉంటుందని దర్శకుడు బుచ్చి బాబు భావిస్తున్నాడు.దీంతో మేకర్స్ ఉత్తరాంధ్ర ఏరియాలో ఆడిషన్స్ ని జరుపుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఆడిషన్ జరుగుతుంది.ఏజ్ తో సంబంధం లేకుండా సినిమాలో నటించే ఆసక్తి ఉన్నవాళ్లు పాల్గొనవచ్చు.