Entertainment

మిస్ ఇండియా పోటీలు పెద్ద మాఫియా…నేను వాటినుంచి బయటపడ్డాను


మిస్ ఇండియా పోటీలు బయటకు కనిపించేంత అందంగా ఉండవు అన్నారు పొలిమేర హీరోయిన్ కామాక్షి భాస్కర్. స్వతహాగా డాక్టర్ అయిన కామాక్షి 2018లో మిస్ తెలంగాణగా ఎంపికయ్యారు.  ఇప్పుడు ఆమె ఆ విషయాల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “నేను మిస్ ఇండియా అవ్వాలి అనుకున్నప్పుడు నేను 84 కిలోలు ఉన్నాను. మిస్ ఇండియా పార్టిసిపేట్ చేయడానికి 2018 లో ఇండియా వచ్చాను అప్పుడు అబ్దుల్ ఫారియా, డింపుల్ హయాతి కూడా ఆ ఇయర్ నాతో పార్టిసిపేట్ చేశారు. తెలంగాణ నుంచి 150 మంది పాల్గొనగా నేను సెలెక్ట్ అయ్యాను. ఐతే ఈ పోటీలకు మినిమం 56 కిలోల వరకు తగ్గాల్సి వచ్చింది. ఈ బ్యూటీ పేజెంట్ పోటీలకు మా నాన్న ఒక్క రూపాయి కూడా ఇవ్వను అన్నారు. అప్పటికి నేను చైనాలో డాక్టర్ చదువుతున్నాను. ఉదయం ఒక పూట హాస్పిటల్ లో పని చేసుకుని మధ్యాహ్నం నుంచి చైనాలో ఉండే ఇండియన్ రెస్టారెంట్స్ కి వెళ్లి అక్కడ డాన్స్ చేసి కొంత డబ్బు సేవ్ చేసుకున్నా..ఈ మిస్ ఇండియా కాంటెస్ట్ కోసం అన్ని రకాలుగా  25 లక్షల వరకు ఖర్చయ్యింది. ఐతే అన్ని ఈ కాంటెస్ట్ లో   వాళ్ళు నన్ను ఒక ప్రశ్న అడిగారు..ఈ మిస్ ఇండియా కాంటెస్ట్ లో నువ్వు విన్ అవ్వకపోతే ఎలా ఫీల్ అవుతావు అని. 

మొదట కొంత బాధ కలుగుతుంది కానీ నేను ఇక్కడే ఆగిపోను..లైఫ్ లో చేయాల్సింది చాలా ఉంది… అని ఆన్సర్ ఇచ్చాను. కానీ ఆ ఆన్సర్ వాళ్లకు నచ్చలేదు. ఐతే ఫైనల్ గా టాప్ 15 లో సెలెక్ట్ అయ్యాను..వాళ్ళు ఒక ఒక ఏడాదికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఐతే వాళ్ళ మేనేజర్ ఈ విషయం మేము వర్క్స్ తెస్తాం ఆ వర్క్స్ మీరు చేయాలి..మేము కొంత పర్శంటేజ్ తీసుకుంటాం మీకు కొంత ఇస్తాం అని చెప్పారు. అప్పుడు నాకు అర్ధమయ్యింది బ్యూటీ పెజెన్ట్రీ నుంచి అమ్మాయిలను మోడలింగ్ లోకి తీసుకెళ్తారని తెలుసుకున్నా. తర్వాత నాకు అర్ధమయ్యింది. ఈ బ్యూటీ కాంటెస్ట్ అంతా మాయా..యంగ్ ఏజ్ లో పొరబడ్డాను అని. ఇందులో మన బుర్రకి ఎలాంటి పని ఉండదు. డిజాయినర్ డ్రెస్ వేసుకుని పోజులు ఇవ్వడం మాత్రమే. ఇదంతా మెకానికల్ గా ఉంది అని నేను అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకున్నా. దాంతో నా ప్రొఫైల్ ని లాక్ చేశారేమో అందుకే మూవీస్ లో నాకు అనుకున్నంత ఛాన్సెస్ రావడం లేదేమో అనిపిస్తుంది. మిస్ ఇండియా పోటీలకు, బ్యూటీ పెజెంట్ పోటీలకు దణ్ణం పెట్టేసాను. ఈ పోటీలు పెద్ద మాఫియా లాంటిదే..ఎందుకంటే వాళ్ళు ఎవరితో మాట్లాడమంటే వాళ్లంతో మాట్లాడాలి లేదంటే ఎక్కడా అవకాశాలు రాకుండా చేస్తారు …ఇవన్నీ తెలుసుకుని మళ్ళీ నేను అపోలోలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేసుకోవడానికి వెనక్కి వచ్చేసాను.” అంటూ మిస్ ఇండియా పోటీల హిస్టరీ మొత్తం చెప్పిని కామాక్షి.



Source link

Related posts

హనుమాన్ దారిలోనే విశ్వక్ సేన్ గామి 

Oknews

యూట్యూబ్ లో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ!

Oknews

వైరల్ అవుతున్న రష్మిక కొత్త పిక్..ఈ రోజు పుట్టిన రోజు కదా

Oknews

Leave a Comment