Health Care

మీరు ప్రేమలో ఉన్నారా.. మీ లవర్ ఇలా చేస్తే మీపై ఇష్టం లేనట్లే?


దిశ, ఫీచర్స్ : లవ్ ఇది ఎప్పుడూ ఎక్కడ ఎలా మొదలువుతుందో ఎవరికీ తెలియదు. చాలా మంది ప్రేమలో పడుతూంటారు.ఇక ఈ జనరేషన్ వారు ఎంత తొందరగా లవ్‌లో పడితే అంతతొందరగా విడిపోతున్నారు. దీంతో చాలా మంది బాధపడాల్సి వస్తుంది.

ఇంక కొంత మంది లవ్ పేరుతో మోసం చేస్తున్నారు. వారు నిజంగా లవ్ చేస్తున్నారా ? నటిస్తున్నారా తెలియక చాలా మంది మోసపోతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రేమించి మోసపోయి సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా చూశాం.

అయితే ప్రేమలో ఉన్న వారు తమది నిజమైన లవ్‌నా లేకపోతే నకిలీ ప్రేమనో తప్పకుండా తెలుసుకోవాలంట. అది ఎలానో తెలుసుకుందాం.

మిమ్ముల్ని ప్రేమిస్తున్నట్లు నటించేవారు, ఎక్కువగా అబద్దాలు చెబుతారంట. అంతే కాకుండా తమకు అవసరం ఉన్నప్పుడు ఒకలా, లేకపోతే మరోలా ప్రవర్తిస్తారంట. అదే విధంగా మీ గురించి, మీ ఆరోగ్యం గురించి అస్సలే పట్టించుకోరంట.

ఒక వేళ వారికి ఏదైనా మనీ అవసరం ఉంటే దానికి కాసేపు ముందే మీపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించి, తర్వాత మెళ్లిగా మనీ అడుగుతారంట. ఇక అవసరం తీరాక, సారీరా.. బిజీగా ఉన్నానంటూ మీతో చాట్ చేయడం, మాట్లాడటం మానేస్తారంట. అందుకే అలాంటి వారికి వీలైనంతగా దూరం ఉండాలంటున్నారు నిపుణులు.

అదే విధంగా నకిలీ ప్రేమ చూపించే వారు, మిమ్ముల్ని శారీరక సౌఖ్యం కోసం ఒత్తిడి చేస్తారంట. మీ సౌకర్యం గురించి అస్సలే పట్టించుకోరు. మీ సంతోషం పట్ల, మీ జీవితం పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. మీకు కష్టం కలిగినా వారికి పెద్దగా చింత కూడా ఉండదు. నకిలీ ప్రేమ చూపించే వారు మీలోని భావోద్వేగాలతో ఆడుకుంటారు. మీ వీక్ పాయింట్లను తెలుసుకొని వాటి ఆధారంగా మిమ్మల్ని తన అవసరానికి వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఉత్తుత్తి వాగ్దానాలు చేసి, ఎప్పుడూ ఆ వాగ్దానాలను నెరవేర్చరు. మీ విషయంలో మీకే అభద్రతాభావం కలిగేలా చేస్తారు. తన గురించి మీరు ఎంత పట్టించుకున్నా, మీ గురించి అస్సలు పట్టించుకోరు.అందువలన ఇలాంటి వారిని గనుక మీరు ప్రేమిస్తున్నట్లైతే వీలైనంత త్వరగా వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు.



Source link

Related posts

అంతా రాధికా మర్చంట్ మెహందీ ముచ్చటే.. అందులో స్పెషల్ ఏమిటంటే?

Oknews

ఆ ఆలయంలో దడపుట్టించే రహస్యాలు.. అర్ధరాత్రి అయ్యిందో అంతే సంగతి

Oknews

మండుతున్న ఎండలు.. ఆరు నెలల లోపు శిశులకు నీళ్లు తాగించొచ్చా..

Oknews

Leave a Comment