Health Care

మీలో ఈ లక్షణాలు కనిపిస్తే మద్యం మానేయడం మంచిది.. లేదంటే డేంజర్‌లో పడ్డట్టే!


దిశ, ఫీచర్స్: చాలా మంది మద్యానికి బానిసలు అయిపోతున్నారు. కొందరు రోజుకు కొద్ది మొత్తంలో తీసుకుంటే మరికొందరు మాత్రం పీపాలు పీపాలు తాగేస్తున్నారు. అరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ మద్యానికి దూరం కాలేక పోతున్నారు. అలాగే పలు అధ్యయనాల్లో కూడా మధ్యం వల్ల చాలా ప్రమాదకర సమస్యలు వస్తాయని వెల్లడైంది.

అయినప్పటికీ చాలా మందికి భయం అనేది లేకుండా పోయింది. నీళ్లు తాగినట్లుగా తాగేస్తున్నారు. అయితే మద్యం అలవాటు ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా మానేయాలని లేదంటే ప్రమాదంలో పడతారని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

* తెల్లవారు జామున నిద్రలేకగా మగతగా.. నీరసంగా ఉంటే మద్యానికి దూరంగా ఉండటం మంచిది.

* అలాగే మద్యం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. దీంతో చిన్న చిన్న వాటికే అనారోగ్యానికి గురవుతుంటారు. పలు ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మద్యం మానేయాలి.

* దగ్గు, కడుపులో ఉబ్బరంగా ఉంటే మద్యం వల్ల అని గుర్తించాలి.

* దురద, దద్దుర్లు వచ్చనట్లైతే మద్యాన్ని పూర్తిగా మానుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

* దంతాలు, చిగుళ్ల సమస్యలు ఏర్పడితే అది మద్యం వలన కూడా కావొచ్చు. కాబట్టి డాక్టర్లను సంప్రదించాలి. వారు చెప్పిన సూచనలు పాటించాలి.    



Source link

Related posts

సమ్మర్ వచ్చిందని సోడా అధికంగా తాగుతున్నారా.. కిడ్నీలు డేంజర్‌లో పడ్డట్లే!

Oknews

మౌని అమావాస్య నుండి వసంత పంచమి వరకు వచ్చే పండగలు ఏవో తెలుసా..

Oknews

రాత్రికి రాత్రే అందంతో అద్భుతం చేయాలా.. ఇలా చేయండి!

Oknews

Leave a Comment