Health Care

మీలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. వెంటనే సైకియాట్రిస్ట్ ను కలవడం ముఖ్యం..


దిశ, ఫీచర్స్ : నేటి యుగంలో శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మీ మానసిక ఆరోగ్యం సరిగా లేకుంటే మీ శారీరక ఆరోగ్యం వల్ల ఉపయోగం ఏముండదు. మానసిక ఆరోగ్యం పై శ్రద్ధ చూపని వ్యక్తులు త్వరలో డిప్రెషన్‌కు గురవుతారు. అందుకే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే మొత్తం ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే మానసిక అనారోగ్య లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే, అది భవిష్యత్తులో ఎన్నో సమస్యలను సృష్టించవచ్చు. అందుకే మానసిక ఆరోగ్యం క్షీణించినప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అధిక భయం..

కొంతమంది ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురవుతుంటారు. దాని కారణంగా వారు త్వరగా డిప్రెషన్‌కు గురవుతారు. మీరు కూడా అనేక విషయాల పై ఒత్తిడికి గురైనట్లయితే వెంటనే మానసిక వైద్యుడిని కలవడం అవసరం కావచ్చు.

2. నిద్రకు తరచుగా అంతరాయం..

కొంతమంది రాత్రిపూట గాఢంగా నిద్రపోతే మరికొంతమందికి సరిగా నిద్ర పట్టదు. ఒక వేళ నిద్ర పోయినా ఈ వ్యక్తుల నిద్రకు మళ్లీ మళ్లీ అంతరాయం కలుగుతుంది. దీని కారణంగా మీరు రోజంతా అలసిపోయి ఉంటారు. ఇలా ప్రతిరోజూ జరిగితే మానసిక ఆరోగ్యం త్వరగా దెబ్బతింటుంది.

3. తరచూ మూడ్ స్వింగ్స్..

మూడ్ స్వింగ్స్ లేదా మూడ్‌లో హెచ్చుతగ్గులు ఉండటం సర్వసాధారణం. కానీ మీరు ఎటువంటి కారణం లేకుండా పదే పదే చిరాకుగా, విచారంగా, కోపంలో ఉన్నారంటే అది మానసిక ఆరోగ్యం బలహీనతకు సంకేతం.

4. ఇతరుల కంటే మిమ్మల్ని మీరు తక్కువగా చూడడం..

ప్రతి వ్యక్తికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకూడదు. మీకు అలాంటి అలవాటు ఉంటే. దీని ద్వారా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని మీ చేతుల్లో ఉంచుకుంటున్నారు.

5. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవడం..

కొంతమంది తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి చాలా కష్టపడతారు. ఇలా చేసేందుకు ప్రవర్తనను మార్చుకోవడం ప్రారంభిస్తే అది మీ డిప్రెషన్‌కు కారణం కావచ్చు. ఎల్లప్పుడూ మీరుగా ఉండండి. ఎవరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకునే తప్పు అస్సలు చేయకూడదు.

మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఈ లక్షణాలలో ఏవైనా మీకు కనిపిస్తే సైకియాట్రిస్ట్ వద్దకు వెళ్లడానికి వెనుకాడకండి.



Source link

Related posts

అసలే వర్షాకాలం: మీ మొబైల్ స్పీకర్‌లోకి వాటర్ వెళ్లాయా.. అయితే టిప్స్ మీ కోసమే!

Oknews

సోడాకి బదులు ఈ డ్రింక్ తాగితే రుచితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది..

Oknews

ఆపిల్ సైడర్ వెనిగర్ తో మెరిసే జుట్టు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..

Oknews

Leave a Comment