Health Care

మీ ఇంటికి క్లాసీ లుక్ ఇవ్వాలనుకుంటున్నారా.. ఈ ట్రెండీ ఐడియాలను ప్రయత్నించండి..


దిశ, ఫీచర్స్ : ప్రతిఒక్కరూ తమ ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. మీ చుట్టూ పరిశుభ్రంగా ఉండటం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన అనుభూతి చెందుతారు. ఇంటికి క్లాసీ లుక్ ఇస్తే అతిథులు కూడా ఆకర్షితులవుతారు. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా, క్లాస్‌గా ఉండడానికి మంచి మేక్ఓవర్ ఇవ్వడం ముఖ్యం. అయితే చాలామంది మేకోవర్ గురించి విన్నప్పుడు చాలా ఖర్చు అవుతుందని భయపడతారు. కానీ తక్కువ బడ్జెట్‌లో కూడా ఇంటికి క్లాస్ లుక్ ఇవ్వవచ్చు. తక్కువ బడ్జెట్‌లో కూడా మీ ఇంటిని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సరైన రంగుల ఎంపిక..

గదికి క్లాస్సి లుక్ ఇవ్వడానికి సరైన రంగును ఎంచుకోవడం ముఖ్యం. ప్రకాశవంతమైన రంగులను ఎంచుకుంటే గది అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లేత రంగులను గోడలకు వేయడం వలన గదికి కొత్త లుక్ ఇస్తుంది. గదికి ముదురు రంగును వేయవద్దు. ముదురు రంగులను వేయడం వలన గది పరిమాణం చిన్నదిగా కనిపిస్తుంది.

2. పాతకాలపు వస్తువులు..

గదిని ఫర్నిచర్ తో డెకరేట్ చేయాలనుకుంటే పాతకాలపు ఫర్నిచర్‌ను ఖరీదు చేయాలి. దీని కోసం ఆన్‌లైన్ షాపింగ్ చేయడం మంచిది. మీరు ఆన్‌లైన్‌లో అనేక డిజైన్లను చూడవచ్చు. అలాగే మీ ఇంటికి ఆధునిక టచ్ ఇవ్వడానికి స్మార్ట్ లైటింగ్ ఉపయోగించండి. అలాగే తక్కువ బడ్జెట్‌లో ఇష్టమైన ఛాయాచిత్రాలు, మొక్కలు, పుస్తకాలు, ఏదైనా చేతి కళలతో గదిని అలంకరించవచ్చు. ఇంటి లోపల మొక్కలు నాటడం ద్వారా మానసిక స్థితి సంతోషంగా ఉంటుంది.

Read More..

రోజూ అల్లోవెరా జ్యూస్ తాగితే ఆ సమస్యలన్నీ మాయం



Source link

Related posts

సమ్మర్‌లో పాలు విరిగిపోతున్నాయా? ఈ బెస్ట్ టిప్స్ మీ కోసం!

Oknews

ఈ సింపుల్ టిప్స్ తో నడుము నొప్పికి చెక్ పెట్టొచ్చు!

Oknews

శివుడు మొసలిగా మారి పార్వతిని ఎందుకు పరీక్షించాడో తెలుసా ?

Oknews

Leave a Comment