దిశ, ఫీచర్స్ : మహిళలు ఎప్పుడూ కూడా ఏదో ఒక వంట చేస్తూ వంటింట్లోనే ఉంటారు. ఇక అంతే కాకుండా వారు తమ గ్యాస్ త్వరగా అయిపోకూడదని వంట అయిపోయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేయడం లేదా గ్యాస్ చిన్నగా పెట్టి వంట చేయడం లాంటి సిల్లీ టిప్స్ పాటిస్తుంటారు.కానీ వారు ఎంత ప్రయత్నించినా గ్యాస్ మాత్రం త్వరగానే అయిపోతుంది. దీంతో వారు ఇబ్బంది పడుతుంటారు. ఇక ఇప్పుడు నిత్యవసర ధరలతో పాటు, గ్యాస్ ధర కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో గ్యాస్ కోసం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే మీరు మీ గ్యాస్‌ను ఎక్కువ రోజుల పాటు వాడాలి, అది త్వరగా అయిపోకూడదు అంటే కొన్ని టిప్స్ పాటించాలి అంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. డైరెక్ట్ బియ్యం కడికి వండ కుండా, బియ్యాన్ని కాసేపు కడిగి నానబెట్టి గ్యాస్ మీద పెట్టడం వలన త్వరగా అన్నం ఉడికిపోతుందంట. దీని వలన గ్యాస్ ఆదా అవుతుందంట.
2. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఏ ఆహారాలనైనా సరే వెంటనే స్టవ్ మీద పెట్టి వేడి చేయడం, వండటం చేయకూడదంట, దీని వలన గ్యాస్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. కొద్ది సేపు పక్కన పెట్టిన తర్వాత వంట లేదా వేడి చేయడం వలన గ్యాస్ ఆదా చేయవచ్చు.
3. చాలా మంది వంట చేయడం అయిపోగానే గ్యాస్ సిలిండర్ వద్ద ఆఫ్ చేయరు. దీని వలన కూడా కొద్ది కొద్దిగా గ్యాస్ లీకై గ్యాస్ త్వరగా అయిపోతుందంట.
4. వర్షాకాలంలో పదే పదే వేడి చేయకుండా ఒకేసారి అందరూ ఉన్నప్పుడు వంట చేసుకొని తినాలంట దీని వలన గ్యాస్ ఆదా చేయవచ్చు.