EntertainmentLatest News

మీ సినిమాలోని దేశభక్తిని ఒప్పుకోము..బ్యాన్ చేసిన దేశాలు 


బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ( hritik roshan)హీరోగా రేపు విడుదల అవుతున్న మూవీ ఫైటర్ ( fighter) దేశభక్తి కి యాక్షన్ అంశాలని  జోడించి తెరకెక్కిన ఫైటర్ మీద భారతీయ సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి  నెలకొని ఉంది. పైగా ఈ మూవీకి షారుక్ కి చాలా సంవత్సరాల తర్వాత హిట్ ఇచ్చిన సిద్దార్ధ్ ఆనంద్(siddharth anand) దర్శకుడు కావడంతో అంచనాలు పీక్ లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్  హృతిక్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులని షాక్ కి గురి చేస్తుంది.

రిపబ్లిక్ డే కానుకగా ఫైటర్ ఈ నెల 25 న అంటే రేపు ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. కానీ గల్ఫ్ కంట్రీస్ లో మాత్రం ఫైటర్ విడుదల అవ్వటం లేదు. గల్ఫ్ కంట్రీస్ లోని ప్రభుత్వాలు ఫైటర్ ని తమ దేశాల్లో విడుదల కాకుండా బ్యాన్ ని విధించారు. అక్కడి రూల్స్ ప్రకారం ఇండియా పాకిస్థాన్ వివాదానికి సంబంధించిన  సినిమాలు ఏమైనా రిలీజ్ అయితే ఆ సినిమాలని తమ దేశాల్లో  ప్రదర్శించడానికి ఒప్పుకోరు.ఇప్పడు ఫైటర్ కూడా  దేశ భక్తి సినిమా కావడంతో బ్యాన్ చెయ్యడం జరిగింది. సల్మాన్ హీరోగా దేశభక్తి టచ్ తో మొన్నీ ఈ మధ్య  వచ్చిన టైగర్ 3 ని కూడా  గల్ఫ్ కంట్రీస్  బ్యాన్ చేసాయి.

హృతిక్ సరసన దీపికా పదుకునే ( deepika padukone) నటించిన ఫైటర్ లో  లేటెస్ట్ గా యానిమల్ (animal)మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చిన అనిల్ కపూర్ ఒక కీలక పాత్రని పోషిస్తున్నాడు. యుఏఈ లో మాత్రం పీజీ 15 వర్గీకరణతో ఫైటర్ విడుదల కానుంది. హిందీ చిత్ర సీమకి చెందిన టాప్ మోస్ట్ తారాగణమంతా ఫైటర్ లో మెరవనుంది.

 



Source link

Related posts

'కాసర్ గోల్డ్' మూవీ రివ్యూ

Oknews

నేడు సాయంత్రం ఉస్తాద్ భగత్ సింగ్… పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు కదా

Oknews

11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ దీక్ష!

Oknews

Leave a Comment