దిశ, ఫీచర్స్ : వాలెంటైన్స్ వీక్‌లో ఆరవ రోజున కిస్ డేగా జరుపుకుంటారు లవర్స్. అంటే ఫిబ్రవరి 13న కిస్ డే. అయితే కిస్ అనగానే చాలా మంది సిగ్గు పడుతుంటారు. కానీ ఈ కిస్ వలన కూడా అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముద్దు పెట్టుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుదంట. మనం కిస్ ఇచ్చుకున్నప్పుడు మెదడులోని ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ అనే రసాయనాలు విడుదలవుతాయి. దీని వలన మన మనసు చాలా ఉల్లాసంగా ఉంటుందంట. అలాగే మనకు ఇష్టమైనవారు మనల్ని ముద్దు పెట్టుకోవడం వలన మనలో ఉన్న బాధలన్నీ మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటారంట. అయితే ఇప్పుడు లిప్ టు లిప్ కిస్ చాలా ఫ్యాషన్ అయిపోయింది. అయితే ఈ లిప్ టు లిప్ కిస్ పెట్టుకోవడం వలన అత్యంత ఉద్వేగభరితమైన ఫీలింగ్స్ ఏర్పడుతాయంట. ఇది మనసులో ఉన్న బాధను మొత్తం పోగొడుతుందంట.ఇక ఎవరైనా చెంప లేదా అరచేతి మీద ముద్దు పెట్టుకోవడం వలన అది స్నేహానికి ప్రతీకనంట.ఇది చాలా సంతోషాన్ని ఇస్తుందంట.