Telangana

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, గ్లోబల్ సిటీ ప్లానర్లతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు-hyderabad news in telugu cm revanth reddy meeting with global city planners on musi riverfront development ,తెలంగాణ న్యూస్



CM Revanth Reddy : దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయల్దేరిన సీఎం రేవంత్​రెడ్డి ఆదివారం దుబాయ్​లో బిజీబిజీగా గడిపారు. హైదరాబాద్ లో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపైనే సీఎం కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. బ్యాక్-టు-బ్యాక్ మీటింగ్ సెషన్‌లలో 56 కిలోమీటర్ల పొడవైన మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి చేయడం, వాణిజ్య అనుసంధానాలు, పెట్టుబడి నమూనాలపై చర్చించారు. దుబాయ్‌లో 70కి పైగా ప్రపంచ డిజైన్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థలు, కన్సల్టెన్సీలు, నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల్లో యూరప్, మిడిల్ ఈస్ట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టులపై గ్లోబల్ సంస్థలు వివరించాయి. దాదాపుగా అన్ని సంస్థలు తెలంగాణతో ప్రభుత్వంతో భాగస్వామ్యం అవ్వడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. తదుపరి సంప్రదింపుల కోసం ఈ సంస్థల ప్రతినిధులు రాబోయే రోజుల్లో తెలంగాణలో పర్యటించనున్నారు.



Source link

Related posts

Telangana News Yasangi Season Is The Same In Telangana Agriculture News | Yasangi Season: తెలంగాణలో యాసంగి సీజన్ యథాతథం

Oknews

Telangana Congress Campaigns Differently With BRS BJP Love Wedding Cards | BRS BJP Love: ప్రేమలో బీఆర్ఎస్, బీజేపీ! త్వరలో పెళ్లి అని వెడ్డింగ్ కార్డ్స్

Oknews

congress party counter tweet on opposition slams on bhatti vikramarka sitting down in yadadri temple | Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టికి అవమానమంటూ విమర్శలు

Oknews

Leave a Comment