Entertainment

మెగాస్టార్ రేంజ్ ని అమాంతం పెంచేసిన ‘ఖైదీ’కి 40 ఏళ్ళు


మెగాస్టార్ చిరంజీవి పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చే సినిమా ‘ఖైదీ’. చిరంజీవి రేంజ్ ని అమాంతం ఎన్నో రేట్లు పెంచేసిన చిత్రమిది. అందుకే ఈ సినిమా మెగాస్టార్ కి, మెగా అభిమానులకి ఎంతో ప్రత్యేకమైనది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సంయుక్త మూవీస్ నిర్మించిన ఈ మూవీ 1983, అక్టోబర్ 28న విడుదలై ప్రభంజనం సృష్టించింది. అమెరికన్ ఫిల్మ్ ‘ఫస్ట్ బ్లడ్’ను స్ఫూర్తిగా తీసుకొని రూపొందిన ఈ చిత్రం, తెలుగు సినీ పరిశ్రమలో అప్పటిదాకా ఉన్న రికార్డులను చెరిపేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లో ఇదే మొదటి ఇండస్ట్రీ హిట్ కావడం విశేషం. అంతటి సంచలనం సృష్టించిన ‘ఖైదీ’ సినిమా విడుదలై నేటికి 40 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

“ఖైదీ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని  చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత , మాధవి లని మొత్తం టీమ్ ని  అభినందిస్తూ, అంత గొప్ప  విజయాన్ని మా కందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు” అంటూ చిరంజీవి రాసుకొచ్చారు.



Source link

Related posts

ఈ వారం ఓటీటీలో 24 సినిమాలు రిలీజ్‌!

Oknews

హీరో,అతని తండ్రి దారుణ హత్య

Oknews

మేము అటవీ జాతి మనుషులం కదా!  ఏమి అనుకోకండి  

Oknews

Leave a Comment