EntertainmentLatest News

మెగా అభిమానులు ఎదురుచూస్తున్న బిగ్ అప్డేట్…


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ షూటింగ్ ఎంత పూర్తయింది? అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? అని తెలుసుకోవడం కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించబోతున్నాయి. 

మెగా అభిమానులకు గుడ్ న్యూస్. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేవలం పది రోజుల షూట్, ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ కి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయిందని, ప్రముఖ నటుడు సముద్రఖని కాంబినేషన్ లో ఒక్కరోజు షూట్ లో పాల్గొంటే సరిపోతుందని సమాచారం. మొత్తంగా చూస్తే, ఇంకా ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూట్ చేయాల్సింది గట్టిగా రెండు వారాలు కూడా లేదట. షూట్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని మూవీ టీం చూస్తోందట. శంకర్ సినిమాలంటేనే భారీతనం. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం తీసుకొని, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 

‘గేమ్ ఛేంజర్’ బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేసి.. చరణ్ తన ఫోకస్ ను బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న ‘RC 16’ పైకి షిఫ్ట్ చేయనున్నాడట. ఈ మూవీ సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది అంటున్నారు. ఈలోపు చరణ్ ‘RC 16’ కోసం ప్రత్యేకంగా మేకోవర్ కానున్నాడని సమాచారం.



Source link

Related posts

Sai Pallavi dancing to Sheila Ki Jawani షీలా కి జవానీ తో అదరగొట్టిన సాయి పల్లవి

Oknews

తెలంగాణ ఫస్ట్ డిటెక్టివ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

అతనితో అఫైర్ నిజమేనన్న సానియా మీర్జా,.

Oknews

Leave a Comment