మెగా ఫ్యామిలీ లో మొత్తం ఎనిమిది మంది హీరో లు ఉన్నారు. ఆ హీరో ల్లో ఏ ఒక్కరు పక్కన అయినా హీరోయిన్ గా నటించి ఆ సినిమా హిట్ అయితే చాలు ఇంక ఆ హీరోయిన్ కెరీర్ నేతి బుట్టలో పడినట్టే అని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వినపడే నానుడి. ఎందుకంటే ఒక హీరో తో మొదలు పెడితే ఇంక కంటిన్యూ గా మిగతా మెగా హీరోల సరసన కూడా నటించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ అదృష్టం పూజ హెగ్డే కి వచ్చింది. ఆల్రెడీ చరణ్,బన్నీ ల తో పూజ నటించింది.చరణ్ తో చేసిన ఆచార్య అలాగే ఇతర హీరో లతో చేసిన కొన్ని పెద్ద సినిమాలు ప్లాప్ అవ్వడంతో బుట్టబొమ్మకి అవకాశాలు లేకుండా పోయాయి.
ఇప్పుడు తాజాగా ఫిలిం నగర్ లో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా సంపత్ నంది దర్శత్వం లో ఒక కొత్త చిత్రం తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా లోనే తేజ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే ని మేకర్స్ ఫిక్స్అయ్యారు ఈ మేరకు సంపత్ పూజా కి కథ కూడా చెప్పాడని పూజా ఒప్పుకుందని అంటున్నారు. విరూపాక్ష బ్రో మూవీలు విజయం సాధించినా కూడా సాయి ధరమ్ తేజ్ మార్క్ మాస్ సినిమా రావాలని అతని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడు సంపత్ దర్శత్వం లో రాబోయే సినిమా ఫుల్ మాస్ సబ్జెక్టు అని మూవీ టైటిల్ గా గాంజా శంకర్ అనే ఫుల్ మాస్ టైటిల్ ని నిర్ణయించారని కూడా తెలుస్తుంది. పూజ హెగ్డే ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమా షూటింగ్ మొదలవుతుందని చిత్ర యూనిట్ చెప్తుంది.
పూజ హెగ్డే కనుక సాయి ధరమ్ తేజ్ తో హీరోయిన్ గా చేస్తే ఇంక మళ్ళి తనకున్న అందానికి యాక్టింగ్ కి వరుసగా మెగా ఆఫర్స్ కొట్టడంతో పాటు మెగా హీరోలతో కూడా వరుసగా సినిమాలు చేస్తుందని అలాగే పూజా సినీ కెరీర్ కి సాయి ధరమ్ తేజ్ సినిమా మంచి బూస్ట్ అప్ ని ఇస్తుందని సినీ పండితులు అంటున్నారు.