Andhra Pradesh

మెహరీన్ తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి నిజమేనా..? Great Andhra


మెగా హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ మెహరీన్ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని త్వరలో వీరిరువురు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒక్కసారిగా గాసిప్స్ మొదలయ్యాయి. జ‌వాన్ చిత్రంలో న‌టించిన వీరిద్ద‌రూ.. ఇప్పుడు డేటింగ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌లే మెగా పిన్స్ వ‌రుణ్ తేజ్‌- లావ‌ణ్య త్రిపాఠి వివాహం జ‌ర‌గ‌డంతో సాయి ధ‌మ‌ర్ తేజ్- మెహ‌రీన్‌ల పెళ్లిపై అనుమానాలు మ‌రింత‌గా పెంచుతున్నాయి. మ‌రోవైపు ఇదే విషయంపై సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందిస్తూ.. హీరోయిన్ తో పెళ్లి వార్తలన్నీ రూమర్లేనని ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం అంటూ చెప్ప‌డంతో ప్రస్తుతానికి వీరు పెళ్లి ముచ్చట్లు ఆగిపోయినట్లే కానీ, ఇలా ఖండించిన వారు కూడా వ‌న్ ఫైన్ డే అందరికీ షాక్ ఇస్తూ గుడ్ న్యూస్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సాయి ధరమ్ తేజ్ 2014లో పిల్లా నువ్వు లేని జీవితంతో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. మొద‌టి సినిమానే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆక్సిడెంట్ త‌ర్వాత తేజ్ చేసిన విరూపాక్ష బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు సాధించింది. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ్రో సినిమాలో కూడా తేజ్ క‌నిపించాడు. అలాగే కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో మెహ‌రీన్ టాలీవుడ్ అడుగుపెట్ట‌గా మహానుభావుడు, రాజా ది గ్రేట్, F2 సినిమాల‌తో మంచి పేరు సంపాధించింది. గ‌తంలో మెహ‌రీన్‌ మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో జరగాల్సిన వివాహం కొన్ని కార‌ణాల వ‌ల్ల ర‌ద్దైంది.



Source link

Related posts

CM Jagan : ఏపీ హక్కులను పరిరక్షించండి.. కృష్ణా జలాలపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

Oknews

AP Revenue Receipts: తిరోగమనంలో ఆంధ్రా ఆదాయం, తక్షణం సరిదిద్దకపోతే సంక్షోభమే..!

Oknews

Pithapuram Crime : పిఠాపురంలో దారుణ హ‌త్య, త‌ల‌పై బండ‌రాయితో దాడి!

Oknews

Leave a Comment