Health Care

మేకప్ లేని మోడల్ బామ్మ.. ఈ వయస్సులో కూడా ర్యాంప్‌ వాక్..


దిశ, ఫీచర్స్ : గ్లామర్ రంగం మొదటి నుంచి ఎవర్ గ్రీన్ రంగం. పూర్తి విశ్వాసంతో ఉంటే ఇక్కడ అవకాశాలకు ఎప్పుడు కొరత ఉండదు. ఎత్తు బాగా ఉండి, స్టేజ్‌పైకి వెళ్లాలనే భయం లేకుంటే, మీరు మోడలింగ్ ప్రపంచంలో సులువుగా గెటాన్ కావచ్చు. కానీ ఇక్కడ కొన్ని సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది. మారుతున్న కాలం నాటి డిమాండ్‌ ఇది. ఈ సమయంలో ప్రజలు తమ ధైర్యాన్ని కోల్పోతారు. సరే ఈ సవాళ్లను సులభంగా అధిగమించే కొందరు వ్యక్తులు ఉన్నారు. వారు ఈ రంగంలో వెనుదిరిగి చూడకుండా విజయం సాధించారు. అలాంటి ఓ మోడల్ గురించి ఈ మధ్యకాలంలో తెగ చర్చించుకుంటున్నారు.

ఇక ప్రతి వ్యక్తి తన శరీరం ఎప్పుడూ యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అది సాధ్యం కాదు, మన శరీరం కాలంతో పాటు మారుతూ ఉంటుంది. పెరిగే వయస్సుని దాచేందుకు మేకప్ చేస్తూ ఉంటారు. కానీ ఓ బామ్మ మాత్రం తన 72 ఏండ్ల వయస్సులో కూడా ఎలాంటి మేకప్ లేకుండా మోడల్స్ కి ధీటుగా నిలుస్తుంది. మరి ఆ మేకప్ లేని మోడల్ బామ్మ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన జోనీ వయస్సు ( 72 ) సంవత్సరాలు. ఆ బామ్మ వయస్సు అంత ఉన్నా మేకప్ లేకుండా ఇప్పటికీ ఓ యంగ్ మోడల్ లాగా కనిపిస్తుంది. ఆమె చర్మ సౌందర్యం గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ నాకు చిన్నతనంలో చర్మ సంరక్షణకు సంబంధించి చాలా సమస్యలు ఉండేవని చెప్పింది. దీన్ని అధిగమించడం అంత సులభం కాదు. కానీ తాను చర్మ సంరక్షణను నా అలవాటుగా చేసుకున్నాను. ఆ తర్వాత తనకు మేకప్ అవసరం లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు.

అలాగే ఆమె సౌదర్య రహస్యాలను వెల్లడించింది. దీని గురించి తన ఇన్‌స్టాలో పంచుకుంటూ తాను ముఖానికి మంచి క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్ ఉపయోగిస్తాను అని చెప్పింది. అలాగే ఒక కప్పు టీతో తన ముఖానికి మాస్క్ వేసుకుంటానని, తన ముఖం పై ఎప్పుడూ ముడతలు, సన్నని గీతలు రావని తెలిపారు. అలాగే తాను ప్రతిరోజూ హెర్బల్ టీ తీసుకుంటానని, దీని ప్రభావంతో తన అసలు వయస్సు కనిపించదని తెలిపింది. తాను ర్యాంప్‌ పై నడిచినప్పుడు ప్రజలు నన్ను చూస్తూనే ఉంటారని చెప్పారు.





Source link

Related posts

ఎండాకాలమని ఫ్రిజ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా..? అయితే జాగ్రత్త!

Oknews

gold,business:బంగారం కొనుగోలు చేసేటప్పుడు మోసపోతామేమో అని భయపడుతున్నారా.. మీ కోసమే ఈ చిట్కా

Oknews

డిగ్రీ కన్నా స్కిల్స్ ముఖ్యం.. రిక్రూట్‌‌‌మెంట్ ప్రాసెస్‌లో నయా ట్రెండ్ !

Oknews

Leave a Comment