Telangana

మేడారం గట్టమ్మ ఆలయంపై ముదురుతున్న వివాదం- నాయకపోడ్ పూజారులు, జాకారం గ్రామస్థులు పరస్పరం దాడులు-medaram news in telugu gattamma temple issue jakaram mudiraj nayakapodu pandits fight for prayers ,తెలంగాణ న్యూస్



హద్దులు మార్చారని ఆరోపణజాకారం గ్రామ పంచాయతీ నుంచి ముదిరాజ్ కులస్థులు ఇటీవల తమకు హైకోర్టు నుంచి వచ్చిన స్టే ఆర్డర్స్ ఉన్నాయని చెప్పగా నాయకపోడ్ కులస్థులు, పూజారులు సైతం తాము తాతల కాలం నుంచి గట్టమ్మ దేవాలయం వద్ద పూజలు చేస్తున్నామని చెప్పారు. మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర (Medaram Sammakka Saralamma Jatara)సందర్భంగా కూడా ఎదురు పిల్ల పండుగ, తిరుగు వారం పండుగ నిర్వహిస్తున్నామని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాకుండా ములుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గట్టమ్మ ఆలయాన్ని కావాలని ధనార్జనే ధ్యేయంగా బౌండరీలు మార్చి వేశారని నాయకపోడ్ పూజారులు ఆరోపించారు. కొంతమంది నాయకుల వ్యక్తిగత స్వార్థం వల్లే తరచూ గట్టమ్మ ఆలయం విషయంలో గొడవలు జరుగుతున్నాయని నాయకపోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, ఆలయ పూజారి కొత్త సదయ్య, తదితరులు ఆరోపించారు. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో కలిపి మొత్తంగా 7 గట్టమ్మ దేవాలయాలు ఉంటాయని, తమ సంస్కృతీ, సంప్రదాయాలపై జాకారం గ్రామస్థులు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. గట్టమ్మ దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చి ఆలయాన్ని పాత పద్ధతిలో ములుగు గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.



Source link

Related posts

Harish Rao expressed his displeasure over the repeated mention of Match Box in the Assembly | Telangana Assembly Harish Rao : పదే పదే అగ్గిపెట్టే ముచ్చట

Oknews

Governor Tamilisai Resign: తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళిసై రాజీనామా

Oknews

Telugu News From Andhra Pradesh Telangana Today 20 January 2024

Oknews

Leave a Comment