ఎక్కడి పనులు అక్కడే..మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం ముందు దృష్టితో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, కాని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని మావోయిస్టు నేత వెంకటేశ్ అసహనం వ్యక్తం చేశారు. సమయం దగ్గర పడుతున్న క్రమంలో ప్రభుత్వం జాతర పనులను కాంట్రాక్టర్లకు ఇచ్చిందని, వాళ్ల నిర్లక్ష్య వైఖరితో పనులను నత్తనడకన నడిపిస్తూ నాసిరకం పనులను చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ తెగిపోయాయని, వాటిని ఇప్పటివరకు నిర్మించలేదన్నారు. ఇప్పుడు ఆదరాబాదరాగా నిర్లక్ష్యంగా రోడ్లు పోయడంతో గుంతలు అలాగే మిగిలిపోయి రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతరకు వస్తున్న ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించకపోవడం, పారిశుద్ధ్య పనులు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో పాటు ఏపని పూర్తి కాకపోవడం వల్ల జాతరకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ వారికి సౌకర్యాలు కల్పించకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారన్నారు. కాబట్టి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి పనులను వేగవంతం చేయాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Source link