Entertainment

మోక్షజ్ఞ మ్యాన్లీలుక్‌ అదుర్స్… నందమూరి ఫ్యాన్స్‌.. బీ రెడీ!


నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడు నందమూరి బాలకృష్ణ. పౌరాణిక, జానపద, సాంఘిక, భక్తి రసాత్మక చిత్రాల్లో సైతం నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అయితే ఎంతో కాలంగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చే విషయమై ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అతన్ని హీరోగా చూడాలన్నదే నందమూరి అభిమానుల చిరకాల కోరిక. ఆ తీపి కబురు బాలయ్య నోటి నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ó వారి కోరిక త్వరలోనే తీరబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘భగవంత్‌ కేసరి’ ఎంత హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన ఒక కార్యక్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానంగా 2024లోనే మోక్షజ్ఞ సినిమా ఉంటుందని చూచాయగా చెప్పారు బాలకృష్ణ. 

నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఒక స్టిల్‌ వైరల్‌గా మారింది. అంతకుముందు బొద్దుగా ఉండే మోక్షజ్ఞ తాజాగా విడుదలైన స్టిల్‌లో మంచి మ్యాన్లీలుక్‌తో, మంచి ఫిజిక్‌తో హీరోలా కనిపిస్తున్నాడు. ఒక హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు పుణికిపుచ్చుకునేలా గత కొంతకాలంగా శిక్షణ తీసుకుంటున్న మోక్షజ్ఞ ఇప్పుడు పూర్తి స్థాయి హీరో లుక్‌లో ఎంతో స్లిమ్‌గా కనిపిస్తున్నాడు. బాలయ్య చెప్పినట్టు ఈ సంవత్సరమే మోక్షజ్ఞ హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

అయితే అతని మొదటి సినిమా ఎలా ఉండబోతుంది? అనేది ప్రేక్షకులకు, అభిమానులకు అంతుపట్టని విషయం. దీనికి సంబంధించి ఆమధ్య బాలకృష్ణ ఒక క్లారిటీ ఇచ్చారు. ‘నేను చేసే సినిమాలైనా, మోక్షజ్ఞ ఎంట్రీ అయినా నేనెప్పుడూ ప్లాన్‌ చెయ్యలేదు. ఇవన్నీ అప్పటికప్పుడు తీసుకునే డెసిషన్సే తప్ప ముందుగా ప్లాన్‌ చేసుకోను. మోక్షజ్ఞ హీరోగా ఈ సంవత్సరం ఎంట్రీ ఇవ్వడం అనేది ఖాయం. అయితే అది ఎవరి డైరెక్షన్‌లో అనే విషయం ఇంకా తేలలేదు. ఇకపోతే మోక్షజ్ఞతో  నేను చెయ్యాలనుకున్న ‘ఆదిత్య 999 మాక్స్‌’. అది మోక్షజ్ఞ రెండో సినిమా అవుతుంది. ఒకవేళ మొదటి సినిమాయే అది కావచ్చు. ఇప్పటివరకైతే దాని గురించి ఆలోచించలేదు. అయితే తప్పకుండా ఈ సంవత్సరమే మోక్షజ్ఞను హీరోగా లాంచ్‌ చేస్తాం’ అంటూ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన  ఫోటోను చూస్తే మోక్షజ్ఞ మొదటి సినిమాలో అతని లుక్‌ అదేనేమో అన్నంతగా ఇంప్రెస్‌ చేస్తోంది. 



Source link

Related posts

రోజా, పోసాని కి అల్లు అర్జున్ బ్రేక్ నిజమేనా!

Oknews

‘స్పిరిట్‌’ ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందంటే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

Oknews

‘కంగువ’ టీజర్‌ : ఇండియన్‌ సినిమాలో నెవర్‌ బిఫోర్‌ అనే రేంజ్‌లో విజువల్స్‌!

Oknews

Leave a Comment