GossipsLatest News

మోదీకి ఓటెయ్యమంటే బాబుకి వెయ్యమన్నట్టేగా


ఏపీలో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి 2024 మే 13 జరగబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దమవడమే కాదు.. ఈ ఎలక్షన్స్ కోసం ఇప్పటికే ఉమ్మడి సభని చిలకలూరిపేట సాక్షిగా నిర్వహించారు కూడా. మరి ఈలెక్కన మోడీ పాలన బాగుంది, మోడీ గారికి ఓటెయ్యమంటే బాబు గారికి ఓటెయ్యమన్నట్టేగా అంటున్నారు. అది నిజమేగా. ఇంతకీ నరేంద్ర మోడి పాలన బావుంది, ఈ ఎన్నికల్లో అలోచించి ఓటెయ్యండి, మోడీ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది. మోడీకి ఓటస్తే బావుంటుంది అంటూ మోహన్ బాబు గారు ఆయన బర్త్ డే స్పీచ్ లో చెప్పడం హైలెట్ అయ్యింది.

నటుడు, నిర్మాత, విద్యాసంస్థల అధినేత, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు రీసెంట్ గా తన పుట్టినరోజుని MB యూనివర్సిటీలో ఘనంగా చేసుకున్నారు. ఈ వేడుకలకి మోహన్ లాల్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మంచు మనోజ్ పొలిటికల్ గా చేసిన కామెంట్స్ ని మోహన్ బాబు కంటిన్యూ చేస్తూ రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసారు. ఓటు కోసం అందరూ డబ్బులు ఇస్తామంటారు, ఎర వేస్తారు, ఇది సందర్భం కాదు, ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడను కానీ.. వచ్చే ఎన్నికల్లో దేశంలో మాత్రం మళ్లీ ప్రధానిగా మోడీనే రావాలని మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఎన్నికల్లో ఇరుపక్షాల వారూ డబ్బులు ఇస్తారు, ఆ డబ్బు మనదే, మనడబ్బే మనకు ఎన్నికల వేళ ఓట్ల కోసం ఇస్తారు, ఆ డబ్బు తీసుకోండి. కానీ ఓటు మాత్రం నచ్చిన వారికే, మంచి చేసిన వారికే ఓటు వేసి భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్లడానికి సహకరించాలని మోహన్ బాబు సూచించారు.

మరి మోదీగారికి ఓటెయ్యమంటే ఏపీ ఎన్నికల్లో బాబుకి వెయ్యమన్నట్టే కదా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ బాబు కి గతంలో చంద్రాబాబుతో మంచి అనుబంధం ఉంది. కానీ హెరిటేజ్ వ్యాపారంలో మోహన్ బాబుకి, చంద్రబాబుకి విభేదాలు రావడంతో చంద్రబాబుని మోహన్ బాబు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మోహన్ బాబు తన పుట్టినరోజు వేళ ఎన్నికల్లో ఓటు వేసే విషయమై చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



Source link

Related posts

Tarak fans feeling on politics రాజకీయాలపై తారక్ అభిమానుల ఫీలింగ్

Oknews

జనసేనకు ప్రచారం చేస్తాను… ఆయనకే ఓటు వేస్తాను!

Oknews

షూటింగ్ డేట్ కాదు చెప్పడానికి పెళ్లి డేట్…మా వెనుక పెద్దలు ఉన్నారు

Oknews

Leave a Comment