Entertainment

‘యమధీర’ టీజర్‌ లాంచ్‌ చేసిన నిర్మాత అశోక్‌ కుమార్‌!


కన్నడ హీరో కోమల్‌ కుమార్‌ హీరోగా, ఇండియన్‌ క్రికెటర్‌ శ్రీశాంత్‌ నెగిటివ్‌ రోల్‌ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్‌లో వేదాల శ్రీనివాస్‌ తొలి చిత్రంగా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు, ఆలీ, సత్యప్రకాష్‌, మధుసూధన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా టీజర్‌ ప్రముఖ నటుడు, నిర్మాత అశోక్‌ కుమార్‌ లాంచ్‌ చేశారు. 

నిర్మాత వేదాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ… ఇది తన మొదటి చిత్రం అని, సినిమాల మీద ప్యాషన్‌తో శ్రీమందిరం ప్రొడక్షన్స్‌ స్టార్ట్‌ చేశానని, ప్రేక్షకులు తమని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి యమధీర సినిమా టీజర్‌ లాంచ్‌ చేసిన తన స్నేహితుడు యాక్టర్‌, ప్రొడ్యూసర్‌ అశోక్‌కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే యమధీర సినిమా థియేటర్లో రిలీజ్‌ కానుంది అని వేదాల శ్రీనివాస్‌ తెలిపారు. 

అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ… తన స్నేహితులు వేదాల శ్రీనివాస్‌ కొత్తగా శ్రీమందిరం ప్రొడక్షన్స్‌ మొదలుపెట్టడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్‌లో తొలి చిత్రంగా వస్తున్న యమధీర చాలా బాగా ఆడాలని అలాగే మరెన్నో చిత్రాలు శ్రీ మందిరం ప్రొడక్షన్స్‌లో రావాలని ఆయన అన్నారు. కన్నడలో 90కు పైగా సినిమాలలో నటించిన కోమల్‌ కుమార్‌ ఈ సినిమాలో కథానాయకుడిగా నటించడం విశేషం అని అన్నారు. క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఫాస్ట్‌ బౌలర్‌ గా మైదానంలో చూపే దూకుడుని   ప్రతినాయకుడిగా చూపించే అవకాశం ఉంది అన్నారు. ఆలాగే ఈ చిత్రం అజర్‌ బైజాన్‌, శ్రీలంక వంటి దేశాలతో పాటు మన దేశంలోని మైసూర్‌, చెన్నై, బెంగళూరు ఇతర ప్రాంతాలలో షూటింగ్‌ జరగడం విశేషం అని తెలిపారు. 



Source link

Related posts

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు

Oknews

ఎన్టీఆర్ బొబ్బిలిపులి ని అలియా భట్ కాపీ కొడుతుందా! 

Oknews

ప్రేమలు మూవీ రివ్యూ

Oknews

Leave a Comment