యాసంగి పంటలు ఎండిపోతున్నాయ్ఆరుగాలం శ్రమించి వరి పంట సాగుచేస్తున్న అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేఖలో హరీశ్ రావు కోరారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో సాగుచేస్తున్న యాసంగి పంటలు(Rabi) చేతికి రావాలంటే వెంటనే సాగు నీరందించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన నాలుగేళ్లలో ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా సాగునీటిని అందుబాటులో ఉంచామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రైతులను ఆదుకోవడంలో అలసత్వం వహిస్తున్నట్లుగా అర్థమవుతుందన్నారు. ఓ పక్క సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. కళ్లముందే ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. కొత్త బోర్లు వేయిస్తూ అప్పుల పాలవుతున్నారన్నారు. వ్యవసాయ బావులకు సంబంధించి పూడికతీత పనుల్లో రైతులు నిమగ్నమయ్యారన్నారు. ఈ దుస్థితిని అధిగమించాలంటే వెంటనే రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి 1 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.
Source link