ఇటీవల విడుదలైన ‘రాజధాని ఫైల్స్’ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల కన్నీటి గాథను కళ్ళకి కట్టినట్టు చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమానే కాదు.. ఇందులోని పాటలు కూడా కట్టిపడేశాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఏరువాక సాగారో’ సాంగ్ చార్ట్ బస్టర్ అయింది. రీసెంట్ గా యూట్యూబ్ వేదికగా వీడియో సాంగ్ రిలీజ్ చేయగా.. విశేష ఆదరణ పొందుతోంది. ఆటపాటలతో రైతులు ఎంతో సంతోషంగా వ్యవసాయ పనులు మొదలుపెట్టడం ఈ సాంగ్ లో మనం చూడవచ్చు. మణిశర్మ మ్యూజిక్ ఎంత బాగుందో.. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా అంతే బాగుంది. అమృత చౌదరి అందం, నాట్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గురు చరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను మంగ్లీ పాడటం విశేషం.
శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదలైంది.