Entertainment

యోగి ఆదిత్యనాధ్ దగ్గర హనుమాన్ టీం…జై శ్రీరామ్   


సినిమా అనేది ఎంత శక్తివంతమైనదో, సినిమా అనేది భారతదేశం మొత్తాన్ని ఎలా ఏకం చేస్తుందో మరోసారి నిరూపించిన   చిత్రం హనుమాన్ ( hanuman)ఇండియా వ్యాప్తంగా ఉన్నా ఉన్న హనుమాన్ భక్తులతో పాటు ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మ రధం పడుతున్నారు. తాజాగా హనుమాన్  టీం ఉత్తరప్రదేశ్ వెళ్ళింది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాధ్( Yogi Adityanat)హైందవ సంప్రదాయాలని అణువణువునా ఒణికి పుచ్చుకున్న వ్యక్తి. పైగా ఆయన ఎప్పుడు కాషాయం వస్త్రాలని మాత్రమే ధరిస్తు ఉంటాడు.పైగా ఆయన  రాముడికి అతి పెద్ద భక్తుడు. ఇలాంటి యోగిని హనుమాన్ హీరో తేజ (teja sajja)దర్శకుడు ప్రశాంత్ వర్మ(prashanth varma) లు కలిశారు. యోగి హనుమాన్ టీం ని  సాదరంగా ఆహ్వానించి సినిమాకి సంబంధించిన అనేక విషయాల గురించి మాట్లాడారు.ఆ తర్వాత  సినిమాల ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలని కాపాడవచ్చని హనుమాన్ టీం తో  చెప్పడంతో పాటు ప్రశాంత్ ని తేజ ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ సమయంలోనే  ప్రశాంతవర్మ యోగితో  హనుమాన్ మూవీ ఇప్పటి యువతరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్పడంతో పాటు  భారతీయ ఇతిహాసాల గొప్పతనాన్ని కూడా హనుమాన్ లో చాలా చక్కగా చెప్పామనే  విషయాన్ని కూడా  చెప్పాడు. అనంతరం  మీడియాతో  ప్రశాంతవర్మ మాట్లాడుతు యోగి ఆదిత్యనాధ్ గారిని కలవడం నిజంగా తమ అదృష్టమని ఆధ్యాత్మికతని అర్ధం చేసుకునే ముఖ్య మంత్రి ఉండటం గ్రేట్ అని చెప్పాడు. 

హనుమాన్ సినిమా ప్రభంజనం అయితే ఇప్పటిలో తగ్గేలా లేదు.రామ భక్త హనుమాన్ కి జై అనే నినాదాలతో ఇండియాలోని థియేటర్స్ మొత్తం దద్దరిల్లిపోతున్నాయి. హనుమాన్ థియేటర్స్ లో ఉన్నప్పుడే అయోధ్య లో రామమందిర ప్రారంభం కావడం నిజంగా హనుమాన్ మేకర్స్ చేసుకున్న అదృష్టమే అని చెప్పుకోవచ్చు. 

 



Source link

Related posts

‘డిమోంటి కాలనీ 2’ ట్రైలర్ అదిరింది.. కానీ తెలుగు ఆడియన్స్ కి నిరాశే!

Oknews

మెగాస్టార్‌ను పద్మవిభూషణ్‌తో సత్కరించనున్న కేంద్ర ప్రభుత్వం?

Oknews

అప్పుడే ఓటీటీలోకి 'గామి'..!

Oknews

Leave a Comment