అసలేం జరిగింది?రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి బాబుల్‌రెడ్డి నగర్‌లో డబుల్ మర్డర్ జరిగింది. బాబుల్‌రెడ్డి నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ.. మద్యానికి బానిసై రోజూ భార్య, పిల్లలను వేధించేవాడు. ఇటీవల వారు నివసిస్తున్న ఇంటిని సైతం అమ్మకానికి పెట్టాడు. ఇల్లు అమ్మగా వచ్చే డబ్బులో తనకు రూ.20 లక్షలు తనకు ఇవ్వాలని లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో శనివారం సాయంత్రం గొడవ పడ్డాడు. అయితే అతడి భార్య డబ్బు ఇచ్చేందు అంగీకరించకపోవడంతో ఆమెపై దాడి చేశాడు. తల్లిని కొడుతుండగా కొడుకు రాకేష్ ఆపేందుకు ప్రయత్నించగా, అతడిపై కూడా లక్ష్మీనారాయణ దాడి చేశాడు. మద్యానికి బానిసై వేధిస్తున్నాడని తండ్రిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి కొడుకు రాకేష్ రాడ్డుతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణకు సాయం చేసేందుకు వచ్చిన మేనమామపైనా రాకేష్ దాడి చేశాడు. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే చనిపోగా, మేమమామ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తండ్రి మద్యానికి బానిసై నిత్యం వేధించేవాడని కుమార్తె తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాకేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
Source link