Health Care

రక్తం చిందిస్తున్న చెట్టు.. అది చూసి చలించిపోయిన జనం – వైరల్ వీడియో


దిశ, ఫీచర్స్ : మానవ శరీరంలో రక్తం ఎంత ముఖ్యమైనది. రక్తం లేకుండా మానవుడు జీవించలేడు. మనుషులే కాదు జంతువులు కూడా రక్తం లేనిదే జీవించలేవు. మనుషులకు కానీ, జంతువులకు కానీ శరీరంలో ఎక్కడైనా చిన్న గాయం అయినా, కోత పడినా రక్తం ధారలా వస్తుంటుంది. అయితే ఇక్కడ ఓ చెట్టును నరికితే మనుషులకు వచ్చినట్టుగా ఎర్రగా రక్తస్రావం జరుగుతంది. వింటుంటే కాస్త వింతగా ఉంది కదా. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి చెట్టును నరికిన వెంటనే మనుషులకు వచ్చినట్టుగా రక్తస్రావం జరుగుతుంది. అలాగే ఆ వ్యక్తి మరొక ప్రదేశంలో ఆ చెట్టును నరికినా అలాగే రక్తం రావడం కనిపిస్తుంది. అది చూసిన ప్రజలు ఇదేం వింత చెట్టు అని ఆశ్చర్యపోతున్నారు. ఈ చెట్టులోపల మనుషుల మాదిరిగా రక్తం నిండి ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

నిజానికి ఇది ‘బ్లడ్ వుడ్ ట్రీ’. బ్లడ్‌వుడ్ చెట్లలో కనిపించే ఎర్రటి ద్రవం వాస్తవానికి ముదురు ఎరుపు రసం, దీనిని శాస్త్రీయంగా ‘కినో’ అని పిలుస్తారు. ఈ రసంలో టానిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది రక్తం లాంటి రంగును ఇస్తుంది. ఈ షాకింగ్ వీడియో @gunsnrosesgirl3 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన వారందరూ వివిధరకాల కామెంట్లను పెట్టారు.



Source link

Related posts

అక్కడ పుట్టుమచ్చలు ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. అత్తింటి వారికి డబ్బే డబ్బు

Oknews

ఎటువంటి వ్యాయామాలు చేయకుండానే బరువు తగ్గుతున్నామని సంతోష పడితే నష్టపోయినట్లే.. ఈ వ్యాధులవల్ల కూడా అలా జరగవచ్చు

Oknews

మధ్యాహ్నం బద్దకంగా ఉంటుందా.. ఇలా చేస్తే మైండ్ రీ ఫ్రెష్ అవుతుంది..

Oknews

Leave a Comment