Health Care

రన్నింగ్ ట్రైన్ ముందు రీల్స్ చేస్తున్న మహిళ.. లోకో పైలట్ చేసిన పనికి ఒక్కసారిగా..


దిశ, ఫీచర్స్ : ఈ మధ్య రీల్స్ పిచ్చి బాగా ముదురుతోంది. సోషల్ మీడియాలో ఫాలోవలర్లను పెంచుకోవాలనే క్యూరియాసిటీతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రమాదకర స్థితిలో సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు కూడా డేంజరస్ స్టంట్లకు వెనుకాడట్లేదు. ఎత్తైన ప్రదేశాలు, లోతైన లోయలు, వేగంగా పరుగెడుతున్న వాహనాలు, ట్రాఫిక్‌తో జామ్ అయిన రోడ్లు ఇలా.. ఎక్కడ బడితే అక్కడ చాన్స్ దొరికితే చాలు ఓ రీల్ చేసేద్దామని ట్రై చేస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ ట్రైన్ ఎదురుగా రీల్స్ చేసే ప్రయత్నం చేయగా.. లోకో పైలట్ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. ఏం జరిగిందంటే..

వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఓ వైపు పట్టాల మీద నుంచి ఓ ట్రైన్ దూసుకు వస్తోంది. మరోవైపు ఓ మహిళ రైల్ పట్టాల మీదకు వచ్చి నిలబడింది. మరో వ్యక్తి ఆమెను వీడియో తీస్తున్నారు. క్రమంగా ట్రైన్ ఆమెను సమీపిస్తోంది. అయినా రీల్స్ కోసం వీడియో షూట్ బిజీలో ఉన్న సదరు మహిళ ఆ విషయం అస్సలు పట్టించుకోలేదు. ఆమెను వీడియో తీస్తున్న వ్యక్తి కూడా ట్రైన్ వచ్చిందన్న విషయాన్ని ఆమెకు చెప్పకుండా తన పని తాను చేస్తున్నాడు. ఇంకేముంది రైలు దగ్గరగా వచ్చింది. అయినా ఆ మహిళ పక్కకు జరగడం లేదు. మరో క్షణమైతే ఆమెను రైలు ఢీకొట్టే చాన్స్ ఉంది. కానీ ఇంతలోనే రైల్ ఇంజిన్ భోగీలోంచి ఆమెను గమనించిన లోకో పైలట్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. రైలు పట్టాల మీద నిలబడి ఉన్న మహిళను ఒక్క తన్ను తన్నగా దెబ్బకు అవతలివైపు పడిపోవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా లోకో పైలట్ చేసిన పనికి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పలువురు కామెంట్లు పెడుతున్నారు.





Source link

Related posts

ఇలా టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది!

Oknews

ఆ వ్యక్తికి 9 నెలల్లో 217 కోవిడ్-19 వ్యాక్సిన్లు… చివరికి ఏం అయ్యిందంటే..

Oknews

15 రోజులకు ఒకసారి రంగుమారుతున్న పువ్వులు.. మీకూ చూడాలని ఉందా..

Oknews

Leave a Comment