2018లో వచ్చిన ఛలో మూవీ ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన నటి రష్మిక. మొదటి సినిమాతోనే అందంతో పాటు అంతకంటే అందమైన నటనతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో అనతి కాలంలోనే అగ్ర కథానాయకిగా ఎదిగింది. తాజాగా ఆమె పారితోషకంకి సంబంధించిన రూమర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
రష్మిక ఇకపై కొత్తగా ఒప్పుకునే సినిమాలకి తన పారితోషకంగా 4 కోట్లు దాకా డిమాండ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమో అబద్దమో తెలియదు గాని రష్మిక మాత్రం 4 కోట్లు దాకా అడుగుతుందనే రూమర్ ఒకటి ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశ మయ్యింది. ఆల్రెడీ తను ఇప్పుడు చేస్తున్న పుష్ప 2 తో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అయిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలకి 3 కోట్లు పారితోషకాన్ని తీసుకుంటుంది. మరి ఇక పై ఒప్పుకునే కొత్త సినిమాలకి 4 కోట్లు డిమాండ్ చేస్తుందనే విషయంపై మరికొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది
సౌత్ లో ఇప్పటివరకు 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళ జాబితాలో సమంత, పూజాహెగ్డే లు ఉన్నారు. ఇప్పుడు రష్మిక వాళ్ళని దాటి ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటే మాత్రం నిజంగా వండర్ అని చెప్పాలి. సోషల్ మీడియా లో ఈ వార్తలని చూస్తున్న కొంత మంది అయితే పుష్ప పార్ట్ 1 అండ్ యానిమల్ తో ఒక్క సారిగా రష్మిక రేంజ్ నేషనల్ లెవల్లో పెరిగిపోయింది కాబట్టి ఆమె అంత డిమాండ్ చెయ్యడంలో తప్పులేదని అంటున్నారు. మరికొంత మంది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతని గుర్తు చేస్తున్నారు.