కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్‌లో ప్రవేశించింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయిన రష్మిక తన తొలి కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’ షూటింగ్ సమయంలో ఆ చిత్రంలో హీరోగా నటించిన రక్షిత్‌శెట్టితో ప్రేమలో పడిరది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. ఇద్దరూ విడిపోయారు. ఆ ఆ తర్వాత ఎవరి కెరీర్‌ను వారు బిల్డప్ చేసుకుంటున్నారు.
ఇక రక్షిత్‌శెట్టి ‘చార్లి 777’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇప్పుడు ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను పంచుకున్నాడు రక్షిత్. ‘రష్మికతో మీరు విడిపోయారు కదా. ఇప్పుడు మీ మధ్య మాటలు ఉన్నాయా?’ అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘మేం ఇప్పటికీ మెసేజ్‌లు చేసుకుంటూనే ఉంటాం. నా సినిమా ఏదైనా రిలీజ్ అయితే నాకు బెస్ట్ విషెస్ చెబుతుంది. ఆమె సినిమా రిలీజ్‌కి ఉన్నా నేను కూడా విషెస్ చెబుతాను. తను ఎన్నో కలలు కన్నది. వాటిని సాకారం చేసుకుంటూ ఇప్పుడు నేషనల్ లెవల్‌లో ఆమె పేరు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. ‘మరి పెళ్ళెప్పుడు?’ అని అడిగితే ‘ఇప్పట్లో పెళ్ళి ఆలోచన లేదు. ప్రస్తుతం నా దృష్టంతా నా కెరీర్‌పైనే ఉంది’ అని తెలిపారు.