EntertainmentLatest News

‘రాజధాని ఫైల్స్’ పబ్లిక్ టాక్.. ప్రతి రైతుబిడ్డ చూడాల్సిన సినిమా


ఈమధ్య కాలంలో ట్రైలర్ తోనే సంచలనం సృష్టించిన సినిమా అంటే ‘రాజధాని ఫైల్స్’ అని చెప్పవచ్చు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమాకి భాను దర్శకత్వం వహించారు. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 15న ఈ చిత్రం విడుదలవుతుండగా.. తెలుగునాట పలు చోట్ల ఒకరోజు ముందుగానే ప్రీమియర్లు వేశారు. బుధవారం సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు చోట్ల షోలు పూర్తవ్వగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

‘రాజధాని ఫైల్స్’ చూసి బరువెక్కిన హృదయాలతో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు. ఇటీవల కాలంలో వాస్తవ సంఘటనలతో ఇంతలా గుండెలను పిండేసే సినిమా రాలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం, ప్రతి సంభాషణ.. హత్తుకునేలా, ఆలోచింపచేసేలా ఉన్నాయని చెబుతున్నారు. ఒక వర్గానికి లబ్ది చేకూర్చేలాగానో, ఒక వర్గానికి వ్యతిరేకంగానో కాకుండా.. రైతుల త్యాగం, వారి ఆవేదననే ప్రధాన అంశంగా తీసుకొని.. వాస్తవాలను చూపించిన తీరు అద్భుతమని అంటున్నారు. మూవీ టీం చెప్పినట్టుగానే ఈ సినిమా ప్రతి ఒక్క రైతుబిడ్డ చూడాల్సిన చిత్రమని గర్వంగా చెప్తున్నారు. ప్రతి విభాగం పనితీరు మెప్పించిందని, ముఖ్యంగా దర్శకుడు భాను ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశాడని ప్రశంసిస్తున్నారు. ప్రీమియర్ షోలకు వస్తున్న స్పందన చూస్తుంటే.. ‘రాజధాని ఫైల్స్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమనిపిస్తోంది.



Source link

Related posts

క్షమాపణ కోరుతూ ప్రధాన మంత్రికి ఉత్తరం రాసిన డా.మోహన్‌బాబు!

Oknews

తగ్గే కొద్దీ మింగుతారు… హీరో విశ్వ‌క్ సేన్‌ ఫైర్! 

Oknews

విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ.. ఇప్పుడు మరో ఓటీటీలోకి!

Oknews

Leave a Comment