EntertainmentLatest News

రాజమౌళి  ప్లేస్ ని కబ్జా చేస్తున్న నాగ్ అశ్విన్ 


ఎస్ఎస్ రాజమౌళి(ss rajamouli)తెలుగు సినిమాని ప్రపంచ సినిమా సరసన నిలబెట్టిన దర్శకుడు. హీరో ఎవరు అనేది అనవసరం. జక్కన్న సినిమా అయితే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడతారు. ఇక  సిల్వర్ స్క్రీన్ పై ఆయన పేరు పడగానే అగ్ర హీరో స్థాయిలో  థియేటర్ మొత్తం విజిల్స్ తో మారుమోగిపోతుంది. అంతలా జక్కన్న ప్రేక్షకాభిమాన్ని పొందాడు. అదే విధంగా  జక్కన్న సినిమాలు  ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళతాడన్న  ఆనవాయితీగా ఉంది. ఇప్పుడు ఆ ఆనవాయితీ ఎవరి ఓన్ ప్రాపర్టీ కాదని  నాగ్ అశ్విన్  నిరూపిస్తున్నాడు.    

అవును..ఆనవాయితీ ఎవరి ఓన్ ప్రాపర్టీ కాదని  కల్కి 2898 ఏడి( kalki 2898 ad) డైరెక్టర్ నాగ్ అశ్విన్(nag ashwin)నిరూపించాడు. కల్కి  షూటింగ్  దగ్గర నుంచే ఏ  మూలనో ఆ డౌట్ అందరిలోను ఉంది.ఇక అది రాను రాను మరింత బలోపేతమైంది. ప్రభాస్(prabhas)తో పాటు  అమితాబ్(amitabh bachchan)కమల్(kamal haasan)లు అడుగుపెట్టడంతో మనం అనుకున్నదే నిజమయ్యే అవకాశం ఉందని  చాలా మంది భావిస్తు  వచ్చారు. ఇక సబ్జెక్టు రివీల్ చెయ్యడంతో పాటు ఒక్కో క్యారక్టర్ కి సంబంధించిన టీజర్ రీలీజ్ చెయ్యంతో నాగీ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడని అర్ధమయ్యింది. ఇక ట్రైలర్ ల్యాండ్ అయిన దగ్గరనుంచి రాజమౌళిని వెనక్కి నెట్టాడు అని ఫిక్స్ అయ్యారు. అందులో ప్రస్తుతానికి ఎలాంటి డౌట్ లేదు. అదేం ట్రైలర్ అండి  బాబు.అసలు తెలుగు సినిమాని చూస్తున్నట్టు లేదని హాలీవుడ్ మూవీ కళ్ళ ముందు ఉందని  ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో చెప్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లని మించి విజువల్ గా కూడా వండర్ గా ఉందనే కితాబుని కూడా ఇస్తున్నారు.మన దేశ ఇతిహాసాల్లో పేర్కొన్న మహామహులు ఇంకా బతికే ఉన్నారని చూపించబోతుడంతో అందరిలో క్యూరియాసిటీ మొదలయ్యింది. కల్కి విషయంలో క్యూరియాసిటీ అనే  పదం వెనకబాటుకి గురయ్యిందని చెప్పవచ్చు.   

సో.. నాగీ  రూపంలో జక్కన్న కి   ఒక సరికొత్త సవాలు హాయ్ చెప్తుంది.  దీంతో  రేపు మహేష్ తో తెరకెక్కించబోయే మూవీ కల్కి ని మించి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. తను ఇప్పటి వరకు ఎలాంటి కథ ఎంచుకున్నాడో తెలియదు కానీ,  కల్కి దెబ్బకి తన కథలో మార్పులు చెయ్యడం పక్కా. ఎందుకంటే అక్కడ ఉంది జక్కన్నకదా! ఏది ఏమైనా   రాజమౌళి ఆలోచనలకి నాగీ మరింత  పదును పెట్టాడనేది వాస్తవం. ప్రస్తుతానికి అయితే  కల్కి   థియేటర్స్ దగ్గరే ఇరవై ఏడు దాకా జాగారం చేద్దాం అనే విధంగా డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు  ప్రేక్షకులు ఉన్నారు. ల్యాండ్ అవ్వకముందే  అనేక రికార్డులని బద్దలు కొట్టిన కల్కి రేపు రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. బాహుబలి, ఆర్ఆర్ ఆర్ రికార్డులు  ఇప్పటికే వెనక్కి వెళ్లాయి.  ఇక కల్కి రూపంలో  ఆస్కార్ మళ్ళీ మన ఇంటికి వచ్చినా రావచ్చనే టాక్ కూడా  నడుస్తుంది.

 



Source link

Related posts

Sai Pallavi dancing to Sheila Ki Jawani షీలా కి జవానీ తో అదరగొట్టిన సాయి పల్లవి

Oknews

RTC ITI: టిఎస్‌ఆర్టీసీ ఐటిఐ కాలేజీకి డీజీటీ అనుమతులు మంజూరు, ప్రవేశాలు షురూ

Oknews

Minister Seethakka Warning: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో అటవీశాఖ అధికారులపై మంత్రి సీతక్క ఆగ్రహం

Oknews

Leave a Comment