హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి, సహజీవనం చేసి, గర్భవతిని చేసి, ఆ తర్వాత అబార్షన్ కూడా చేయించాడంటూ లావణ్య అనే మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది.
మొన్నటివరకు ఈ వివాదంలో వీళ్లిద్దరూ కాకుండా మాల్వి మల్హోత్రా, మస్తాన్ పేర్లు మాత్రమే వినిపించాయి. ఇప్పుడు మరో వ్యక్తి వచ్చి చేరాడు. అతడే ఆర్జే శేఖర్ భాషా.
హీరో రాజ్ తరుణ్ కు తను బెస్ట్ ఫ్రెండ్ నని చెప్పుకుంటున్న ఆర్జే శేఖర్ భాషా.. లావణ్యపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. దీనికి సంబంధించి శేఖర్-లావణ్య మాట్లాడుకున్న ఫోన్ సంభాషణ ఆడియో టేపు కూడా లీకైంది.
లావణ్యను పచ్చి మోసగత్తె అంటున్నాడ శేఖర్ భాషా. మస్తాన్ కు, లావణ్యకు మధ్య అక్రమ సంబంధం ఉందని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. మస్తాన్, లావణ్య కలిసి డ్రగ్స్ వ్యాపారం చేశారని కూడా ఆరోపిస్తున్నాడు.
మస్తాన్ కు ఇంకొంతమంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందని తెలిసి లావణ్య నిలదీసిందంట. దీంతో అతడు లావణ్యతో సన్నిహితంగా ఉండే వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేశాడట. ఇప్పుడు అదే టెక్నిక్ ను లావణ్య, రాజ్ తరుణ్ పై ఉపయోగిస్తోందని ఆరోపిస్తున్నాడు శేఖర్ భాషా.
తన చెల్లి పెళ్లి ఉందని గుంటూరుకు లావణ్యను ఆహ్వానించాడట మస్తాన్. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి, అత్యాచారం కూడా చేశాడట. ఈ విషయాల్ని లావణ్య స్వయంగా తన కంప్లయింట్ లో పేర్కొందని చెబుతూ, ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా బయటపెట్టాడు శేఖర్.
సీన్ లోకి శేఖర్ భాషా రావడంతో ఈ వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. అటు తన కొత్త సినిమా ప్రచారం కోసం మీడియా ముందుకొస్తాడని భావించిన రాజ్ తరుణ్, తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడు.
The post రాజ్-లావణ్య వివాదం.. మధ్యలో ఆర్జే appeared first on Great Andhra.