EntertainmentLatest News

రామ్ చరణ్ కి డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ వద్దన్నాడు


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటో ఎంతో అభిమానం. ఈ విషయాన్నీ చెర్రీ చాలా సందర్భాల్లో  చెప్పాడు. పైగా తన తండ్రి చిరంజీవి తర్వాతి  స్థానం పవన్ దే అని కూడా చెప్పాడు. పవన్ కి  కూడా చెర్రీ అంటే ఎంతో అభిమానం. చాలా ఫంక్షన్స్ లో  పవన్ ఈ విషయాన్ని  చెప్పాడు. ఇద్దరకీ కంబైన్డ్ ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు.ఇప్పుడు ఆ ఇద్దరికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. 

చరణ్ తాజాగా ఒక  అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. చెన్నై కి చెందిన ప్రముఖ  వేల్స్ యూనివర్సిటీ  గౌరవ డాక్టరేట్ ని  ప్రకటించింది. కళారంగంలో అందించిన సేవలకు గాను ఆ అవార్డు ని అందిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చరణ్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఏప్రిల్ 13న ఒక కార్యక్రమం జరిపి డాక్టరేట్ ని ప్రకటిస్తారనే టాక్ అయితే వినపడుతుంది.  కాకపోతే ఇక్కడ ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే  కొన్నాళ్ల కితమే పవన్ కళ్యాణ్ కి కూడా  వేల్స్ యూనివర్సిటీ  డాక్టరేట్ ని ప్రకటించింది. కారణాలు తెలియదు గాని  పవన్ దాన్ని  తిరస్కరించారు. అయితే ఇప్పుడు అబ్బాయి రామ్ చరణ్  డాక్టరేట్ ని అందుకోవడం విశేషం

చరణ్ ప్రస్తుతం  శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా జరగండి అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఆ తర్వాత బుచ్చి బాబు సాన తో ఒక మూవీని చెయ్యబోతున్నాడు. ఇటీవలే ఆ మూవీ స్టార్ట్ అయ్యింది. కాగా సినిమా పరిశ్రమకి చెందిన చాలా మంది నటులకి డాక్టరేట్ లు అందుకున్నారు. ఇప్పుడు ఆ కోవలో చరణ్ కూడా చేరాడు.

 



Source link

Related posts

పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తో బాక్సాఫీస్ బరిలో విక్రమ్!

Oknews

‘లియో’ విడుదలపై గందరగోళం.. టెన్షన్‌లో మేకర్స్‌!

Oknews

రష్మిక అంటేనే బ్రాండ్.. హీరోల పాలిట లక్కీ హీరోయిన్‌!

Oknews

Leave a Comment