వెండి తెరపై అద్భుతాలను పండించే తమిళ దర్శకధీరుడి శంకర్ రూపొదించిన రోబో 2.0 సినిమా భారత సినిమా పరిశ్రమలో ఈ ఏడాదికి అత్యధిక వసూళ్లను రాబట్టేలా ఉంది. భారీ అంచనాలతో విడుదలైన “థగ్స్ ఆఫ్ హిందుస్తాన్” దారుణంగా ఫ్లాప్ అయ్యింది, అయితే దీని ప్రభావం ఆ వెంటనే విడుదలైన రోబో 2.0 సినిమా మీద పడుతుందని సినీ పరిశ్రమ నిపుణులు అంచనా వేశారు.
కానీ అంచనాలకు ఏ మాత్రం అందకుండా శంకర్ చేసిన త్రీడీ మాయతో బుధవారంతో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న రోబో 2.0 ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 500 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దేశీయంగా 370 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ విజువల్ వండర్ అంతర్జాతీయ మార్కెట్లో మరో 130 కోట్లు రాబట్టి మొత్తం 500 కోట్లను రాబట్టినట్లు తెలిసింది.