కార్పొరేట్ విద్యకు పోటీగా
“విద్య అనేది పిల్లలకు ఇవ్వగల ఆస్తి, విద్య రంగంలో వెచ్చించే ఖర్చు అంతా రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి పెట్టుబడి అవుతుంది” అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలను తీసుకురావడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మన విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి వివరించింది.