Telangana

రూ. 250 కోట్లకు పైనే శివబాలకృష్ణ ఆస్తులు, బినామీల పేర్లపై 214 ఎకరాల భూమి!-hyderabad crime news in telugu hmda shiva balakrishna assets 250 crores acb investigation ,తెలంగాణ న్యూస్



రూ.250 కోట్ల ఆస్తులుశివబాలకృష్ణ తన పేరిట, బినామీల పేరుతో 214 ఎకరాల భూమి, ఏడు ఇళ్లు, ఒక విల్లా ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. వీటితో పాటు కుటుంబ సభ్యుల పేరుతో 29 ప్లాట్లు ఉన్నట్లు విచారణలో తేలింది. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు బంధువుల పేరుతో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. తెలంగాణతో పాటు ఏపీలోని విశాఖపట్నంలో శివబాలకృష్ణకు ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బయటపడిన ఆస్తులు రూ.250 కోట్ల విలువ చేస్తాయని అధికారులు తెలిపారు. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్‌ను కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది ఏసీబీ. నవీన్ విచారణ కూడా ముగియడంతో కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు అధికారులు. నవీన్ కస్టడీకి ఇవ్వాలని మళ్లీ కోర్టును కోరాలని ఏసీబీ భావిస్తోంది. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణను కూడా ఏసీబీ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు మరో 14 రోజులు రిమాండ్‌ను పొడగించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు.



Source link

Related posts

TS Teachers Promotions Issue: కోర్టు వివాదంతో టీచర్స్ ప్రమోషన్స్‌కు బ్రేకులు

Oknews

KCR Is Likely To Take A Decision On Key Schemes In The Cabinet Meeting To Be Held On 29. | TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు

Oknews

brs working president ktr called chalo medigadda from march 1st | Chalo Medigadda: మార్చి 1 నుంచి చలో ‘మేడిగడ్డ’కు బీఆర్ఎస్ పిలుపు

Oknews

Leave a Comment