దిశ, ఫీచర్స్ : కలలు అందరికీ వస్తుంటాయి. ప్రతిరోజూ ఎన్నో కలలు కంటూ ఉంటాం. అయితే పొద్దున్నే నిద్ర లేవగానే కొన్ని గుర్తుకొస్తాయి.కొన్ని మర్చిపోతాము. వాటిలో కొన్ని కలలు మంచివి, మరికొన్ని భయానకంగా ఉంటాయి. అయితే, స్వప్న శాస్త్రంలో ప్రతి కలకి ఒక అర్థం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కలల శాస్త్రంలో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. మనం చూసే కలలు మన మానసిక స్థితి గురించిన సమాచారాన్ని అందజేస్తాయని సైకాలజిస్టులు కూడా చెబుతున్నారు. ఒక సారి పెళ్లి అయ్యాక.. మళ్లీ పెళ్లి జరిగినట్లు కలలు వస్తే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
మీరు ఇప్పటికే వివాహం చేసుకుని, మళ్లీ పెళ్లి అయినట్లు కలలు కంటున్నట్లయితే, మీ ప్రస్తుత కుటుంబ జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయని అర్ధం. ఇది మీ భాగస్వామితో వాదనలు, చికాకులకు సంకేతంగా చెప్పబడింది. అందువల్ల, అలాంటి కలలతో.. మీరు కుటుంబ జీవితం గురించి జాగ్రత్తగా ఉండాలి.
పెళ్లిని కలలో చూడటం అంత మంచిది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కలల శాస్త్రం ప్రకారం, మీరు కలలో వివాహం చేసుకుంటున్నట్టు కలలుగన్నట్లయితే, భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే కలలో మీ స్నేహితుడి పెళ్లి జరగడం మీకు కనిపిస్తే, అది శుభం కాదని అర్థం. ఇది మీ పురోగతికి అడ్డంకిగా మారుతుందని అంటున్నారు. ముందు ముందు మీకు వారితో ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.