EntertainmentLatest News

రేషన్ కార్డు సినిమా అని తక్కువ అంచనా వెయ్యకండి..మణిశర్మ ఉన్నాడు


కొన్ని సినిమాలు టైటిల్స్ దగ్గర నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలగచేస్తాయి. ఎప్పుడెప్పుడు ఆ మూవీ థియేటర్స్ లో కి వస్తుందా అని కూడా  ఎదురుచూస్తుంటారు. అలాంటి ఒక చిత్రమే సఃకుటుంబానాం. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది. ఇప్పుడు ఈ  మూవీకి సంబంధించిన పోస్టర్ ఒకటి పలువుర్ని ఆకర్షిస్తుంది.

 తాజాగా  సఃకుటుంబానాం  ఫస్ట్ లుక్ అండ్  మోషన్ పోస్టర్  రిలీజ్ అయ్యింది. రేషన్ కార్డు డిజైన్ తో  చాలా వెరైటీ గా ఉంది.  అందులో రాజేంద్ర ప్రసాద్, రాజశ్రీ నాయర్ లు కూర్చోని  ఉన్నారు. పైన వారి పిల్లలు నుంచొని ఉన్నారు. అందులో వారి పేర్లు, ఏజ్ లు  కూడా ఉన్నాయి. పైగా రాజేంద్ర ప్రసాద్ సీరియస్ లుక్ తో ఉండడంతో పోస్టర్ ఆసక్తి గా మారింది.ఆ రేషన్  కార్డు రాజేంద్ర ప్రసాద్ ది. అయన ప్రసాద్ రావు అనే క్యారక్టర్ లో నటిస్తున్నాడు.  యువ జంట  రామ్ కిరణ్, మేఘ ఆకాష్ హీరో హీరోయిన్ లుగా  చేస్తున్నారు. హెచ్ ఎన్ జి సినిమాస్ బ్యానర్ లో  మహాదేవ గౌడ్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి  ఉదయ్ శర్మ రచనా  దర్శకత్వాన్ని వహించాడు. రేషన్ కార్డు లాగా ఉన్న ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి మణిశర్మ గారు చాలా పెద్ద అసెట్. కంటెంట్ ని నమ్మి మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంత మంది ఆర్టిస్టులు, ఇంత మంచి కాంబినేషన్స్ తో  రీసెంట్ గా ఏ సినిమా రాలేదు. కంటెంట్ ఉంటే  తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. మా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందని దర్శకుడు  ఉదయ్ శర్మ చెప్పాడు.బ్రహ్మానందం, సత్య, రాజశ్రీ నాయర్, శుభలేఖ సుధాకర్, భద్రం, తాగుబోతు రమేష్, నిత్యశ్రీ, రమేష్ భువనగిరి, శ్రీప్రియ తదితరులు నటిస్తున్నారు. మధు దాసరి కెమరామెన్ గా, శశాంక్ మాలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 

 



Source link

Related posts

అతనితో నిజాయితీగా ఉన్నానంటున్న అవతార్ డైరెక్టర్..ఆర్ఆర్ఆర్ టీం గర్వం 

Oknews

Wide discussion in BRS about the political activities of Kalvakantla Kavitha

Oknews

tv anchor anasuya bharadwaj latest news

Oknews

Leave a Comment