EntertainmentLatest News

రైటర్ గా మారిన నాని.. స్టోరీ అదిరిపోతుంది!


డైరెక్టర్ అవుదామని సినీ పరిశ్రమకు వచ్చి, హీరో అయ్యాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). ‘అష్టా చమ్మా’తో హీరోగా పరిచయడం కావడానికి ముందు.. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. హీరోగా మారిన తర్వాత డైరెక్షన్ జోలికి మాత్రం పోలేదు నాని. అయితే కథల జడ్జిమెంట్ విషయంలో మాత్రం నానిలో ఓ మంచి దర్శకుడు కనిపిస్తుంటాడు. అందుకే ఆయన నటించిన సినిమాల్లో.. మెజారిటీ చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందుతుంటాయి. అలాంటి నాని.. హీరోగా పరిచయమైన 15 ఏళ్ళ తరువాత తనలోని రచయితని పరిచయం చేయబోతున్నాడు.

ఆగష్టు 29న ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్న నాని.. తన నెక్స్ట్ మూవీగా శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘హిట్-3’ (Hit 3) చేయనున్నాడు. అయితే ఈ సినిమాకి నానినే కథని అందిస్తున్నాడట. నిజానికి నాని ‘హిట్-3’ని కాస్త లేట్ గా చేయాలనుకున్నాడు. కానీ తనకి అదిరిపోయే స్టోరీలైన్ తట్టడంతో.. దానిని డైరెక్టర్ శైలేష్ కి చెప్పి డెవలప్ చేపించాడట. స్క్రిప్ట్ అద్భుతంగా రావడంతో.. ‘హిట్-3’ని ముందు చేయాలని నాని నిర్ణయించుకున్నాడట.

నాని హోమ్ బ్యానర్ అయిన ‘వాల్ పోస్టర్ సినిమా’లో ‘హిట్-3’ రూపొందనుంది. ఇందులో అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నాని కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి, విలన్ గా రానా దగ్గుబాటి నటించనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మరి నాని కథతో తెరకెక్కనున్న ‘హిట్-3’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



Source link

Related posts

Peddapalli BRS MP Candidate Koppula Eshwar | Peddapalli BRS MP Candidate Koppula Eshwar | బీజేపీలో చేరితే పునీతులైపోవచ్చన్న కొప్పుల ఈశ్వర్

Oknews

Devara is a huge craze for overseas rights దేవర ఓవర్సీస్ రైట్స్ కి భారీ క్రేజ్

Oknews

Chandrababu Naidu may return to NDA 6 years after breaking ties 2014 సరే.. 2024లో పొత్తు హిట్టా.. ఫట్టా?

Oknews

Leave a Comment