Telangana

రైతుల వద్దకు కేసీఆర్… ఇవాళ 3 జిల్లాల్లో పర్యటన, మధ్యాహ్నం ప్రెస్ మీట్-brs chief kcr tour in nalgonda suryapet and janagaon districts on march 31 today inspect the crops ,తెలంగాణ న్యూస్



కేసీఆర్ జిల్లాల టూర్ షెడ్యూల్ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఎర్రవల్లి నుంచి కేసీఆర్‌ (KCR)బయల్దేరుతారు.ఉదయం 10.30 గంటలకు జనగామ జిల్లా పరిధిలోని ధరావత్‌ తండాకు చేరుకుంటారు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడుతారు.ఉదయం 11.30 గంటలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వెళ్తారు. అర్వపల్లి, సూర్యాపేట మండల పరిధిలోని పంటలను పరిశీలిస్తారు.మధ్యాహ్నం 1.30 గంటలకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.మధ్యాహ్నం 2 గంటలకు భోజనం.మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది.సాయంత్రం 4.30 గంటలకు నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి చేరుకుంటారు. నిడమనూరు మండల పరిధిలో పొలాలను పరిశీలిస్తారు.రాత్రి 9 గంటలకు ఎర్రవెల్లికి చేరుకోవటంతో కేసీఆర్ జిల్లాల పర్యటన(KCR Districts Tour) ముగుస్తుంది.మరోవైపు ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి.‌ సాగునీటి కాలువలు వట్టిపోయాయి. పంటపొలాలు నెర్రలు బారాయి. పంటలు ఎండుతున్నాయి. ఎండిన పంటపొలాలను చూసి దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఎండిన పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు కొందరు బావుల్లో పూడిక తీస్తుండగా మరికొందరు ట్యాంకర్ ల ద్వారా పంటపొలాలకు నీటి సప్లై చేస్తున్నారు.‌ నీటి వసతి లేని రైతులు ఎండిన పంటలను పశువులకు మేతగా మార్చుకుంటున్నారు. మరికొందరు కడుపు మండి నిప్పంటించి తగులబెడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే వెలాది ఎకరాల్లో వరిపంట ఎండిపోయింది. సిరిసిల్ల, మానకొండూర్, కరీంనగర్, హుస్నాబాద్ నియోజకవర్గాలో పంటనష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండిపోయిన పంటలకు ఎకరాన 30 వేల రూపాయల పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.‌ లేకుంటే పెట్టిన పెట్టుబడి రాక అప్పులపాలై ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Source link

Related posts

TS Assembly KRMB Issue: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు ఇచ్చేది లేదన్న ఉత్తమ్… అసెంబ్లీలో తీర్మానం

Oknews

కాసుల కోసం కక్కుర్తి- ఏసీబీ చిక్కిన ఎస్సై, ఆర్టీసీ డిపో మేనేజర్-adilabad woman si huzurabad rtc depot manager trapped in acb net taking bribe ,తెలంగాణ న్యూస్

Oknews

9 రోజుల్లో 7 దివ్య క్షేత్రాల సందర్శన- అతి తక్కువ ధరలో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ-secunderabad news in telugu irctc divya dakshin yatra 9 days 7 temples visit ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment